Jabardasth: బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష. తన అందంతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. పలు సీరియల్స్ లో నటిస్తున్న వర్ష జబర్దస్త్ వేదికతో తన పరిచయాన్ని పెంచుకుంది. మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. జబర్దస్త్ కు గెస్ట్ గా వచ్చి అక్కడే సెటిల్ అయిపోయింది. అతి తక్కువ సమయంలో లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
నిజానికి జబర్దస్త్ లో అతి తక్కువ సమయంలో వర్ష కు అంతా గుర్తింపు రావడానికి కారణం మరో కమెడియన్ ఇమాన్యుయేల్. అతడితో కలిసి స్కిట్ చేస్తూ బాగా రెచ్చిపోతుంది. హగ్ లతో, ముద్దులతో బాగా రచ్చ చేస్తుంది. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుంది అని కూడా టాక్ వినిపించింది. కానీ రేటింగ్ కోసం అలా చేస్తుంటామని చెప్పుకొని తప్పుకునేవారు. ఇదిలా ఉంటే స్కిట్ కోసం ఏమైనా చేసే వర్ష తాజాగా మరింత దిగజారిపోయింది.
జబర్దస్త్ లోనే కాకుండా పలు షో లలో కూడా పాల్గొని తెగ సందడి చేస్తుంది వర్ష. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో వర్ష స్కిట్ కోసం చిత్తు కాగితాలు ఏరుకునే అమ్మాయిల గెటప్ వేసుకొని కనిపించింది. చూడటానికి అచ్చం పిచ్చి అమ్మాయిలాగా కనిపించడంతో ఈ గెటప్ లో చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సీరియల్స్ లో ఎలా ఉండేదో.. జబర్దస్త్ కి వచ్చాక స్కిట్ లా కోసం బాగా దిగజారుతుందని అంటున్నారు నెటిజన్లు.
ఇక ఇందులో ఇమ్మానుయేల్ తన దగ్గరికి వచ్చి.. ఇంత అందంగా ఉండి ప్లాస్టిక్ ను ఏరుకుంటున్నావా అంటూ నా దగ్గరికి వస్తే హీరోయిన్ గా చేస్తా అని అనడంతో వెంటనే వర్ష పిచ్చిదాని సార్ అని అంటుంది. అందుకే నన్ను లవ్ చేస్తున్నావ్ అని ఇమ్మానుయేల్ అనేసరికి వీరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుందని.. బయట జనాలను రేటింగ్ పేరుతో అలా చేసినట్లు నమ్మిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor anasuya, Anchor rashmi, Extra jabardasth, Jabardast Varsha, Jabardasth immanuel, Sudheer