JABARDASTH VARSHA ABOUT TROLLS IN EXTRA JABARDASTH LATEST EPISODE PROMO GOES VIRAL IN SECONDS NR
Jabardasth Varsha: జబర్దస్త్‌కు వర్ష గుడ్ బై చెప్తుందా.. ఆమె తమ్ముడి ప్రశ్నకు ఈ నిర్ణయం తీసుకుందా!
Jabardasth Varsha
Jabardasth Varsha: బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయమే. పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ బుల్లితెర సీరియల్స్ లో బిజీగా ఉంటూ మరోవైపు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా బాగా సందడి చేస్తుంది.
Jabardasth Varsha: బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయమే. పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ బుల్లితెర సీరియల్స్ లో బిజీగా ఉంటూ మరోవైపు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా బాగా సందడి చేస్తుంది. జబర్దస్త్ లో గెస్ట్ గా పాల్గొన్న వర్ష.. తన తొలి పర్ఫార్మెన్స్ తో మంచి రెస్పాన్స్ అందుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. అతి తక్కువ సమయంలో జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో మరో కమెడియన్ ఇమ్మానియేల్ తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ షోతో పాటు మరో ఎంటర్టైన్మెంట్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా అవకాశాన్ని అందుకొని అక్కడ కూడా బాగా సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా వర్ష జబర్దస్త్ కు గుడ్ బాయ్ చెప్తుందా అనే ప్రశ్నలు బాగా ఎదురవుతున్నాయి.
నిజానికి అతి తక్కువ సమయంలో బుల్లితెరలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వర్ష మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. తన అందంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటూ తన హాట్ ఫోటోలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా అది క్షణం లో వైరల్ గా మారింది.
కానీ ఆ ప్రోమోను యూట్యూబ్ లో వెంటనే డిలీట్ చేశారు. అసలు ఆ ప్రోమోలో ఏం జరిగిందో చాలా వరకు ఎవరికి తెలియక పోగా.. ప్రస్తుతం జబర్దస్త్ లో వర్ష ఉంటుందా.. ఉండదా అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే తన స్కిట్ అనంతరం రోజా.. ఏంటి వర్ష జబర్దస్త్ ను మానేయాలనుకుంటున్నావ్.. అసలేం జరిగిందని ప్రశ్నించింది.ఇక వర్ష స్పందిస్తూ తన జబర్దస్త్ లో స్కిట్ లు చేయడం వల్ల బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇండస్ట్రీలో జరిగే వాటిపై.. మన వరకు అవన్నీ చాలా సులువని..మనం ఇక్కడ వేరు.. మన ఇంట్లో వేరు అంటూ బాగా ఎమోషన్ అయ్యింది.
తనను తన తమ్ముడు తన ముఖం పై ఫోన్ చూపిస్తూ.. ఏంటక్కా ఇది అనేసరికి తను తట్టుకోలేకపోయానని బాగా ఎమోషనల్ తో మాట్లాడింది. ఇక అందరిని ఒక మాట అడుగుతూ.. మీ ఇంట్లో మీ అక్కనో, చెల్లినో ఎవరైనా ఏమైనా అంటే మా చెల్లిని ఎందుకు అంటున్నారని కోపం వస్తుంది కదా అలాంటిది నన్ను ఎలా అన్నారు అంటూ.. నేను ఒక ఆడపిల్లనే కదా అని ఏడ్చింది. ఇక అక్కడున్న వాళ్లు కూడా బాగా ఎమోషనలయ్యారు. దీంతో తన తమ్ముడి ప్రశ్నకు జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకుందా అని తెగ ప్రశ్నలు వేస్తున్నారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.