జబర్దస్త్ నుంచి నాగబాబు, అనసూయ ఔట్...లోకల్ గ్యాంగ్స్ పేరుతో మరో చానెల్లో ప్రత్యక్షం...
జీ తెలుగు లోకల్ గ్యాంగ్స్ పేరిట ఓ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో జబర్దస్త్ జడ్జ్ నాగబాబు, అలాగే యాంకర్ అనసూయ కనిపించారు. అలాగే ఈ షోలో జబర్దస్త్ టీములు సైతం ఎత్తిపోతల పథకం తరహాలో కొత్త ప్రోగ్రాంలో ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైపర్ ఆది కూడా ఈ టీమ్ లో ఉన్నట్లు సమాచారం.
news18-telugu
Updated: November 18, 2019, 9:09 AM IST

జబర్దస్త్ నుంచి నాగబాబు, అనసూయ ఔట్...లోకల్ గ్యాంగ్స్ పేరుతో మరో చానెల్లో ప్రత్యక్షం...
- News18 Telugu
- Last Updated: November 18, 2019, 9:09 AM IST
అనుకున్నంత పని అయిపోయింది. జబర్దస్త్ టీమ్‌తో సుదీర్ఘ కాలం అనుబంధం ఉన్న నాగబాబు, అనసూయ తెగదెంపులు చేసేసుకున్నారు. గత కొంతకాలంగా జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగులో ఓ ప్రోగ్రాం రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ జీ తెలుగు లోకల్ గ్యాంగ్స్ పేరిట ఓ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో జబర్దస్త్ జడ్జ్ నాగబాబు, అలాగే యాంకర్ అనసూయ కనిపించారు. అలాగే ఈ షోలో జబర్దస్త్ టీములు సైతం ఎత్తిపోతల పథకం తరహాలో కొత్త ప్రోగ్రాంలో ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైపర్ ఆది కూడా ఈ టీమ్ లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జబర్దస్త్ షో మొదలై ఇప్పటికే దాదాపు 7 సంవత్సరాలు పూర్తి అవ్వనున్నాయి. అయినప్పటికీ ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి పేరు సంపాదించుకొని, సినిమా ఇండస్ట్రీలో సైతం అగ్ర కమెడియన్స్ గా వెలుగొందుతున్నారు. అయితే మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన జబర్దస్త్‌కు పోటీగా ఎన్నో కామెడీ షోలు ఇతర చానెల్స్ లో వచ్చినప్పటికీ దాని ముందు పోటీకి నిలవలేకపోయాయి. అయితే తాజాగా జీ తెలుగు సైతం జబర్దస్త్ తరహాలో లోకల్ గాంగ్స్ ప్రారంభించడం గమనార్హం. మరి ఈ కొత్త ప్రోగ్రాంలో జబర్దస్త్ నుంచి ఎంత మంది కమెడియన్స్ జంప్ అవుతారో చూడాల్సిందే.
అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ నిర్ణయం.. రెండూ నావే అంటున్న బ్యూటీ..
హద్దులు దాటితే జైలుకే : అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
ఛీఛీ.. మీరు అసలు మగాళ్లేనా.. నెటిజన్లపై మండిపడిన అనసూయ..
బాలయ్య సినిమాలో జబర్దస్త్ అనసూయ.. విలన్‌గా MLA రోజా..?
బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో జబర్దస్త్ నటీనటులు..
అనసూయ దెబ్బకు.. ఆలోచనలో పడ్డ జబర్దస్త్ టీమ్..
Loading...