ఎమ్మెల్యే రోజా రుణం తీర్చుకోలేనంటున్న సుడిగాలి సుధీర్...జబర్దస్త్‌యే నా జీవితం...

సుడిగాలి సుధీర్‌ను తొలి నుంచి నాగబాబుతో పాటు ఎమ్మెల్యే రోజా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. తాను టీమ్ లీడర్ అయినప్పటి నుంచి జడ్జిగా రోజా చాలా మద్దతు ఇచ్చారని పలు సుడిగాలి సుధీర్ స్వయంగా పలుమార్లు ఒప్పుకున్నాడు.

news18-telugu
Updated: November 30, 2019, 5:15 PM IST
ఎమ్మెల్యే రోజా రుణం తీర్చుకోలేనంటున్న సుడిగాలి సుధీర్...జబర్దస్త్‌యే నా జీవితం...
రోజా, సుడిగాలి సుధీర్
  • Share this:
సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌తోనే తన ప్రయాణం అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. నాగబాబు, అనసూయ, చమ్మక్ చంద్ర ఇప్పటికే లోకల్ గాంగ్స్ కార్యక్రమంలో తమ జర్నీ స్టార్ట్ చేసేయగా, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి లీడింగ్ టీమ్ మేట్స్ కూడా వెళ్లిపోతారని భావించినా వారంతా మల్లెమాలతోనే కొనసాగుతామని ప్రకటించేశారు. అయితే దీని వెనుక జడ్జి రోజా కూడా తన వంతు పాత్ర పోషించినట్లు సమాచారం. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ను తొలి నుంచి నాగబాబుతో పాటు ఎమ్మెల్యే రోజా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. తాను టీమ్ లీడర్ అయినప్పటి నుంచి జడ్జిగా రోజా చాలా మద్దతు ఇచ్చారని పలు సుడిగాలి సుధీర్ స్వయంగా పలుమార్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు తనకు పర్సనల్ లైఫ్‌లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా రోజా తనకు హెల్ప్ చేశారని సుధీర్ తన సన్నిహితులతో తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గతంలో జబర్దస్త్ వీడిన ధనరాజ్, షకలక శంకర్, వేణు లాంటి వాళ్లకు బయట అటు సినిమాల్లోనూ, ఇటు బుల్లితెరపైనా పెద్దగా అవకాశాలు ఏమీ లేవు. ఒకట్రెండు సినిమాల్లో హీరో అనిపించుకున్నప్పటికీ, వాళ్ల కెరీర్ లో అవేమీ పెద్ద మార్పులు తేలేదు.

దీంతో జబర్దస్త్ లోనే కొనసాగితే బాగుండేదని, వారంతా భావించారని టాక్ వినిపిస్తోంది. అయితే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా జబర్దస్త్ వదిలి వెళితే వాళ్లలాగే అయిపోతామనే భయం ఉంది. ఆ మేరకు ఎమ్మెల్యే రోజా బ్రెయిన్ వాష్ చేసారని, దీంతో నాగబాబు వెంట నడవాలనుకున్న వారంతా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>