హైపర్ ఆదికి షాకిచ్చిన రైజింగ్ రాజు, దొరబాబు...జబర్దస్త్‌కు ద్రోహం చేయలేమంటూ...

జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగు చానెల్‌లో లోకల్ గాంగ్స్ ప్రోగ్రాం సిద్ధమై పోయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలై సందడి చేసింది. అందులో జడ్జి నాగబాబు, యాంకర్ అనసూయలు ఆ ప్రోగ్రాంలోకి జంప్ అయినట్లు కన్ఫార్మ్ గా తెలుస్తోంది.

news18-telugu
Updated: November 18, 2019, 6:46 PM IST
హైపర్ ఆదికి షాకిచ్చిన రైజింగ్ రాజు, దొరబాబు...జబర్దస్త్‌కు ద్రోహం చేయలేమంటూ...
హైపర్ ఆది, రైజింగ్ రాజు, దొరబాబు (Image: Youtube)
  • Share this:
జబర్దస్త్‌కు పోటీగా మరో ప్రోగ్రామ్ టెలివిజన్ ప్రపంచంలో వెలుగులోకి రానుంది. గతంలో ఎన్నో కామెడీ షోలు వచ్చినప్పటికీ జబర్దస్త్ ముందు నిలవలేకపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం మల్లెమాల జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగు చానెల్‌లో లోకల్ గాంగ్స్ ప్రోగ్రాం సిద్ధమై పోయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలై సందడి చేసింది. అందులో జడ్జి నాగబాబు, యాంకర్ అనసూయలు ఆ ప్రోగ్రాంలోకి జంప్ అయినట్లు కన్ఫార్మ్ గా తెలుస్తోంది. అయితే జబర్దస్త్ నుంచి ఏఏ టీములు లోకల్ గ్యాంగ్స్ కు జంపు జిలానీ అవుతారు అనే దానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్ టీమ్స్‌లో హైపర్ ఆది టీమ్ నెంబర్ వన్ అనే టాక్ ఉంది. దీంతో హైపర్ ఆదిని లాగేయాలనే లోకల్ గ్యాంగ్స్ మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. అయితే అందుకు హైపర్ ఆది సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైపర్ ఆది టీమ్ లోని కీలక సభ్యులైన రైజింగ్ రాజు, దొరబాబు మాత్రం తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ తోనే ట్రావెల్ చేస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం. కాగా ఇప్పటికే హైపర్ ఆది నాగబాబు వెంట నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జబర్దస్త్ షో మొదలై ఇప్పటికే దాదాపు 7 సంవత్సరాలు పూర్తి అవ్వనున్నాయి. అయినప్పటికీ ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి పేరు సంపాదించుకొని, సినిమా ఇండస్ట్రీలో సైతం అగ్ర కమెడియన్స్ గా వెలుగొందుతున్నారు.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...