గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన మెగా బ్రదర్ నాగబాబు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమై పోయాడు. ఆ తర్వాత తన సినిమాలు, టీవీ షోలతో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత అడపా దడపా రాజకీయ వ్యాఖ్యలు చేసినప్పటికీ నాగబాబు మాత్రం పాలిటిక్స్ కు దూరం అయిపోయాడు. అయితే తాజాగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన నాగబాబు మరోసారి పాలిటిక్స్ లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగబాబు ప్రత్యక్షం అవ్వడం కలకలం రేపింది. ఇప్పటికే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నాగబాబు ప్రస్తుతం లోకల్ గ్యాంగ్స్ లో జడ్జిగా చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో జనసేనలో బిజీ అయి తమ్ముడికి చేదోడు వాదోడుగా నిలిచేందుకు నాగబాబు సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు తిరుపతి వేదిక సాక్ష్యంగా నిలిచిందని టాక్.
నాగబాబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే పవన్ ప్రత్యక్షంగా కాకపోయినా అతడి సన్నిహితులు జనసేనకోసం ఫుల్ టైమ్ పనిచేసే నేతలు కావాలని, పవన్ ఒక్కరే పూర్తి బాధ్యతలు తీసుకుంటే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం జనసేన మనుగడకు గడ్డు పరిస్థితులు ఏర్పడిన క్షణంలో తమ్ముడికి బాసటగా నిలిచేందుకు నాగబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Janasena, Janasena party, Nagababu