JABARDASTH TEAM MEMBERS SHOCKING DECISION MAJOR EFFECT ON COMEDY SHOW BS
జబర్దస్త్ పని అయిపోయినట్లే.. సుధీర్, హైపర్ ఆది దెబ్బ భారీగానే..
జబర్దస్త్ కమెడియన్స్ (Source: Twitter)
జబర్దస్త్‌కు పోటీగా ఓ ఛానల్లో లోకల్ గ్యాంగ్స్ పేరుతో కామెడీ షో రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆ ఛానల్ ప్రోమో కూడా రిలీజ్ చేసేసింది. అందులో జడ్జిగా నాగబాబు, యాంకర్‌గా అనసూయ కనిపించారు.
జబర్దస్త్ అంటే మొదటగా గుర్తొచ్చేది మెగా బ్రదర్ నాగబాబు. ఈయన తన నవ్వులతో, జడ్జిమెంట్‌తో ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఈ కామెడీ షోకు ఆయన ప్రత్యేక ఆకర్షణే అని చెప్పాలి. నాగబాబుతో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర.. ఇలా టీమ్‌లు, ఆర్టిస్టులు జబర్దస్త్‌తో పేరు, ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. యాంకర్ అనసూయ కూడా ఈ షో ద్వారానే హైలైట్ అయ్యారు. అయితే.. జబర్దస్త్‌కు పోటీగా ఓ ఛానల్లో లోకల్ గ్యాంగ్స్ పేరుతో కామెడీ షో రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆ ఛానల్ ప్రోమో కూడా రిలీజ్ చేసేసింది. అందులో జడ్జిగా నాగబాబు, యాంకర్‌గా అనసూయ కనిపించారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర కూడా ఈ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం. జబర్దస్త్ టీమ్‌ల దాదాపుగా లోకల్ గ్యాంగ్స్‌కు మారిపోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్‌లకు ప్రధాన ఆకర్షణగా ఉన్న వీళ్లంతా వెళ్లిపోతే, ఆ షో పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఏడేళ్లు పూర్తి చేసుకోనున్న ఈ కామెడీ షో నుంచి మెయిన్ రోల్స్ తప్పుకోవడం వల్ల షో కళ తప్పుతుందా? లేక మునుపటి జోష్‌లోనే ఉంటుందా? అన్నది ప్రశ్నగా మిగిలింది.
అటు.. టీమ్ లీడర్లు మినహా మిగతా ఆర్టిస్టులు కూడా జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ వాళ్లు వెళ్లకపోతే వారి భవిష్యత్తు ఏంటి? జబర్దస్త్ షో నిర్వాహకులు.. కొత్త టీమ్ లీడర్లను తీసుకొచ్చి మళ్లీ ట్రాక్ ఎక్కిస్తారా? అన్న బోలెడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన జబర్దస్త్‌కు పోటీగా ఎన్నో కామెడీ షోలు ఇతర ఛానళ్లలో వచ్చినా దానిముందు నిలవలేకపోయాయి. అయితే.. ఆ షో ప్రధాన తారాగణమే లేకుండా పోతుండటం వల్ల పరిస్థితి ఏంటన్నది తెలియాలి. ఇక.. జబర్దస్త్ నుంచి కొత్త ప్రోగ్రాంకు ఎంతమంది జంప్ అవుతారో తేలాల్సి ఉంది. అటు.. పటాస్ నుంచి యాంకర్ రవి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో నోయల్ లేదా చలాకీ చంటి యాంకరింగ్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి.
మరోవైపు, వర్షిణి కూడా షో నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె కూడా సదరు ఛానల్‌కు జంప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి.. జబర్దస్త్ షో నుంచి దర్శకులు నితిన్, భరత్ వెళ్లిపోయిన తర్వాత నాగబాబు మొత్తం తానేయై చూసుకుంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా రెమ్యునరేషన్ వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై జబర్దస్త్ స్కిట్స్‌లో టీం లీడర్స్ పంచ్‌లు వేశారు.
ఇకపోతే, జబర్దస్త్‌లో కంటే.. కొత్త ప్రోగ్రాంలో డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఆ ఛానల్ రెడీ అయ్యిందని, అందుకే ఆర్టిస్టులు కట్టకట్టుకొని జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. సదరు ఛానల్లో కొత్త ప్రోగ్రాం నవంబరు రెండు లేదా మూడో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆలోగా, 2, 3 జబర్దస్త్ ప్రోగ్రాంలలో నాగబాబు కనిపించే అవకాశాలున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.