Home /News /movies /

JABARDASTH TEAM LEADERS CHALAKI CHANTI KEVVU KARTHIK FIGHT BECAUSE OF VARSHA AND HERE THE DETAILS PK

Jabardasth Varsha: జబర్దస్త్ టీమ్ లీడర్స్ మధ్య చిచ్చు పెట్టిన వర్ష.. కెవ్వు కార్తీక్‌పై చంటి సీరియస్..

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha).. సోషల్ మీడియాలో కూడా ఈ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దానికి కారణం అందం ప్లస్ అభినయం కలిపి ఉండటమే. జబర్దస్త్ (Jabardasth) స్టేజీపై అదిరిపోయే అందాలతో పాటు మంచి కామెడీ కూడా పండిస్తూ దూసుకుపోతుంది వర్ష.

ఇంకా చదవండి ...
జబర్దస్త్ కామెడీ షోలో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ వర్ష. సీరియల్స్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జబర్దస్త్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ స్టేజీపై ఇమ్మాన్యుయేల్‌తో ఈమె చేసే రొమాంటిక్ ట్రాక్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే టాక్ బయట కూడా వచ్చేలా వాళ్లిద్దరూ అక్కడ రొమాన్స్ చేస్తున్నారు. వీళ్ల కెమిస్ట్రీ చూసిన తర్వాత కచ్చితంగా ఏదో ఉందనిపిస్తుంది కూడా. అదే వాళ్ల ఇమేజ్ పెరగడానికి కూడా కారణం. అలా అనుకోవాలనే అక్కడ అలాంటి ట్రాక్ నడుపుతున్నారు కూడా. సుధీర్, రష్మి ఎలాగైతే ఆ ట్రాక్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారో.. ఇప్పుడు వర్ష, ఇమ్మాన్యుయేల్ కూడా ఇదే చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె కారణంగా జబర్దస్త్ షోలో గొడవలు వచ్చాయి. టీమ్ లీడర్స్ కొట్టుకుని తిట్టుకున్నారు. ఈ వారం ప్రోమోలో అదంతా హైలైట్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే ఎప్రిల్ 1 రోజు అంతా ఫూల్స్ డే అంటారు కదా.. అలా జబర్దస్త్ టీమ్ లీడర్స్‌ను కూడా ఫూల్స్ చేయాలని స్కిట్ చేసాడు కెవ్వు కార్తీక్.

ఆయన టీమ్‌లోనే వర్ష కూడా చేస్తుంది. ఈ సారి వర్షతో కామెడీ చేయించాడు కార్తీక్. ఎండలు మండిపోతున్నాయి అంటూ కార్తీక్ అంటే.. తాగుతారా అని వర్ష అడుగుతుంది. ఏముంది అంటే ఎప్రిల్ ఫూల్ అంటూ చెప్తుంది వర్ష. నన్ను కాదు మిగిలిన టీమ్ లీడర్స్‌ను ఫూల్ చేద్దామని అక్కడ్నుంచి వస్తారు వర్ష, కార్తీక్. ఈ క్రమంలోనే ఆది ఉండే రూమ్‌కు వెళ్లి తాను ఒకరిని గుద్దానండి అంటూ చెప్తుంది. హారన్ కొట్టలేదా అంటూ కొట్టానండీ అయినా వాడు పక్కకు జరగలేదు అంటూ సమాధానం చెప్తుంది. అదేంటి అంటే.. వాడు ఫుట్ పాత్‌పై ఉన్నాడండీ అంటూ చెప్తుంది. ఆ తర్వాత చలాకీ చంటి దగ్గరికి వెళ్తుంది వర్ష.

అక్కడ చంటి సీరియస్ అవుతూ.. నువ్వు అసలు ఆర్టిస్టువేనా.. డైలాగులు అనేవి నీకు నువ్వుగా చెప్పాలి.. కార్తీక్ చెప్తే నేర్చుకోవడం కాదు అంటాడు. దాంతో అక్కడే ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కి దూకుతానంటుంది వర్ష. దాంతో కార్తీక్‌పై మరింత సీరియస్ అవుతాడు చంటి. కిందకి వచ్చి ఎప్రిల్ ఫూల్ అంటూ కామెడీ చేస్తుంది వర్ష. దాంతో ఆ అమ్మాయి అక్కడ్నుంచి కాలుజారి పడిపోతే నువ్వు తీసుకుంటావా బాధ్యత అంటూ సీరియస్ అవుతాడు చంటి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardast Varsha, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు