జబర్దస్త్‌లో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది. అమ్మాయి ఉంటే అదృష్టం వస్తుందని కొందరు అంటుంటారు. అలా ఎంతమందికి దశ తిరిగిందో తెలియదు కానీ కొందరికి మాత్రం ఈ సూత్రం మాత్రం కొందరు జబర్దస్త్ కమెడియన్లకు బాగా కలిసొచ్చింది. వాళ్ల జీవితాలు నిజంగానే అమ్మాయిలు వచ్చిన తర్వాత మారిపోయాయి. రియల్ లైఫ్‌లో కాకపోయినా రీల్ లైఫ్‌లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ల కెరీర్‌కు మరింత రెక్కలొచ్చాయి. వాళ్లే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది. సుధీర్ అంటే వెంటనే మరో పేరు కూడా గుర్తొస్తుంది. అదే రష్మి గౌతమ్. ఈ ఇద్దరి మధ్య ఏం లేదని అందరికీ తెలుసు.. కానీ ఏదో ఉందనే భ్రమతోనే సుధీర్ కెరీర్ మారిపోయింది. ఈ విషయం తనే ఒప్పుకున్నాడు కూడా. సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్లకు కూడా రష్మి సుధీర్ అంటే తెలుసు అని. అలాగే తన విజయం వెనక ఉన్న అమ్మాయి పేరు రష్మీ గౌతమ్ అంటూ తెలిపాడు. అలాగే హైపర్ ఆది కూడా వర్షిణితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇరగదీస్తున్నాడు. ఇలా కొందరు కమెడియన్లు తమ జోడీలను కూడా వెతుక్కుంటున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ కూడా ఇదే చేస్తున్నాడు. అతడే జబర్దస్త్ న్యూ సెన్సేషన్ ఇమ్మాన్యుయేల్. మనోడు చేసింది చేసింది తక్కువ స్కిట్స్ అయినా కూడా కుమ్మేస్తున్నాడు. స్క్రీన్‌పై తన కామెడీతో మాయ చేస్తున్నాడు. వచ్చిన కొన్ని రోజుల్లోనే స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పట్లో హైపర్ ఆది రెచ్చిపోయినట్లు చాలా ఫాస్టుగా ఈయన పేరు తెచ్చుకుంటున్నాడు.
ఇప్పుడు తన జోడీని కూడా వెతుక్కుంటున్నాడు ఇమ్మాన్యుయేల్. ఆ ముద్దుగుమ్మ పేరు వర్ష. సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు జబర్దస్త్ షోలో కనిపిస్తుంది. ఈ మధ్య వరసగా స్కిట్స్‌లో ఇమ్మాన్యుయేల్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది. ఈ ఇద్దరిపై రాసిన స్కిట్స్ కూడా బాగానే పేలుతున్నాయి. దానికితోడు అదిరిపోయే అందాల షోతో పిచ్చెక్కిస్తుంది ఈమె. అయితే ఇమ్మాన్యుయేల్, వర్షల మధ్య ఏదో నడుస్తుందని చాలా వార్తలే వస్తున్నాయి. పైగా వర్ష కూడా తనకు ఇమ్ము అంటే యిష్టమంటూ హొయలు పోతుంది. మరోవైపు ఈ ఇద్దరి రిలేషన్ గురించి జబర్దస్త్ సీనియర్ కమెడియన్ అదిరే అభి మాత్రం మరోలా స్పందించాడు.
తనకు సుధీర్, రష్మిల స్టోరీ గురించి తెలుసు.. వాళ్లిద్దరూ మంచి స్నేహితులే కానీ ఏం లేదని తేల్చేసాడు అభి. కానీ ఇమ్ము, వర్ష గురించి మాత్రం తెలియడం లేదు. ఎందకుంటే వాళ్లతో తనకు పెద్దగా టచ్ లేదంటున్నాడు. ఎవరి స్కిట్ వాళ్లు చేసుకుని వెళ్లిపోతామని చెప్పుకొచ్చాడు అభి. తనకు తెలిసి ఈ ఇద్దరూ కూడా మంచి స్నేహితులే అయ్యుంటారని చెప్తున్నాడు. కానీ ఇమ్మూ, వర్ష మాత్రం రోజురోజుకీ తమ రిలేషన్ రేంజ్ పెంచేస్తున్నారు. జబర్దస్త్‌లో ఈ ఇద్దరూ కనిపిస్తేనే విజిల్స్ పడుతున్నాయి. ఏకంగా సుధీర్, రష్మి జోడీకి పోటీగా వచ్చేస్తున్నారు ఈ జంట. మరి నిజంగానే అభి చెప్పినట్లు స్నేహితులా లేదంటే ఏదైనా జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Emmanuel, Jabardast Varsha, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood