Home /News /movies /

JABARDASTH TANMAY REVEALS INTERESTING FACTS ABOUT GETUP SRINU SK

గెటప్ శ్రీను గురించి షాకింగ్ విషయాలు చెప్పిన జబర్దస్త్ తన్మయ్

గెటప్ శ్రీను, తన్మయ్

గెటప్ శ్రీను, తన్మయ్

సుడిగాలి సుధీర్ టీమ్‌లో పనిచేయడం చాలా బాగుటుందని చెప్పాడు జబర్దస్త్ తన్మయ్. సుధీర్ కష్టపడ్డాడని.. మిమిక్రీలు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాడని వెల్లడించాడు.

    జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ స్టేజిపై కనిపించారంటే పంచ్‌లు పటాకుల్లా పేలుతాయి. సుధీర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగదీస్తే.. శ్రీను గెటప్‌లతో అదరగొడతాడు. ఇక రాంప్రసాద్ ఆటో పంచ్‌లు వేసి పొట్టలు చెక్కలయ్యేలా నవ్విస్తారు. ఈ త్రయానికి జనాల్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఐతే బయటకు వచ్చినప్పుడు వీరు ఆటిట్యూట్ చూపిస్తారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా గెటప్ శ్రీనుకు పొగరు ఎక్కువని చాలా మంది ఆరోపించారు. ఐతే అందులో నిజం లేదని.. శ్రీను చాలా మంచివాడని జబర్దస్త్‌లో లేడీ గెటప్ వేసే తన్మయ్ వెల్లడించాడు.

    గెటప్ శ్రీనుకు సెలబ్రిటీ అనే ఆటిట్యూట్ ఉండదు. శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి ఒకసారి వైజాగ్‌లో ఒక ఈవెంట్‌కు వెళ్లా. మేం కార్లో వెళ్తుండగా రోడ్లపై చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతున్నారు. అప్పుడు శ్రీను కారు అద్దాలు దించి.. హెల్మెట్ పెట్టుకోవాలని అందరినీ కోరాడు. దయచేసి హెల్మెట్ వాడాలని.. దండంపెట్టి మరీ విజ్ఞప్తి చేశాడు. శ్రీను అన్న కామన్ మ్యాన్‌లానే ఆలోచిస్తాడు. మాకు బాగా సపోర్ట్ ఇస్తాడు.
    తన్మయ్


    ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు జబర్దస్త్ తన్మయ్. అంతేకాదు సుడిగాలి సుధీర్ టీమ్‌లో పనిచేయడం చాలా బాగుటుందని చెప్పాడు. సుధీర్ ఎంతో కష్టపడ్డాడని.. మిమిక్రీలు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాడని వెల్లడించాడు. అంత మంచి పొజిషన్‌లో ఉన్నా ఎలాంటి ఆటిట్యూడ్ చూపించడని ప్రశంసలు కురిపించాడు తన్మయ్.
    First published:

    Tags: Auto ramprasad, Getup srinu, Jabardasth, Jabardasth comedy show, Sudigali Sudhir, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు