Home /News /movies /

సుడిగాలి సుధీర్ నోట మియా మాల్కోవా మాట.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటూ..

సుడిగాలి సుధీర్ నోట మియా మాల్కోవా మాట.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటూ..

మియా మాల్కోవా, సుడిగాలి సుధీర్

మియా మాల్కోవా, సుడిగాలి సుధీర్

Jabardasth: జబర్దస్త్ కామెడీతో స్టార్‌డమ్ సంపాదించుకున్న ఆర్టిస్టుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. తన మల్టీ టాలెంట్‌తో అనతి కాలంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

    జబర్దస్త్ కామెడీతో స్టార్‌డమ్ సంపాదించుకున్న ఆర్టిస్టుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. తన మల్టీ టాలెంట్‌తో అనతి కాలంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ విధానం, వంశపారంపర్యంగా నేర్చుకుంటున్న మ్యాజిక్‌లతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాడు. తాను బకరా అయినా ఫరవాలేదు.. ప్రేక్షకులకు హాస్యం అందించాలన్న దృక్పదంతో వేసే స్కిట్‌లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక, స్క్రీన్‌పై యాంకర్ రష్మి గౌతమ్‌తో కలిసి చేసే రొమాన్స్ కనులకు ఇంపుగా ఉంటుంది. వీరిద్దరు నిజంగానే లవర్స్ అన్నట్లు ఫీలయ్యేలా ఆ పాత్రల్లో ఒదిగిపోతారు. కొందరైతే వీళ్లిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని అంటుంటారు. ఇక, సుధీర్ విషయానికి వస్తే.. అతడో మన్మథుడు. అమ్మాయి కనిపిస్తే చాలు.. వారి వెనకాల వెళ్లే క్యారెక్టర్, అమ్మాయిల వెంట పడతావంటూ వేరే ఆర్టిస్టులు సుధీర్‌పై వేసే పంచ్‌లు కేక పుట్టిస్తాయి. అందుకే సుధీర్‌కు అంత క్రేజ్.

    అయితే, గురువారం ప్రసారమైన జబర్దస్త్ షో లో కూడా స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది సుడిగాలి సుధీర్‌పై పంచ్‌లు వేశాడు. వీరిద్దరు కలిసి చేసిన ఈ స్కిట్‌లో భాగంగా వీరిద్దరు లేడీ గెటప్‌లో ఉన్న శాంతి స్వరూప్, రైజింగ్ రాజులను ప్రేమిస్తారు. అయితే, తమను పెళ్లి చేసుకోవాలంటే పెద్దలు ఒప్పుకోవాలని.. తాము చేసుకోబోయేవాళ్లకు సెలబ్రిటీ హోదా ఉండాలని, వాళ్లకు ఏమైనా అయితే.. టీవీల్లో వేస్తారని శాంతి స్వరూప్ అంటాడు. ఈ సందర్భంగా.. సుధీర్ కలగజేసుకొని.. మియా మాల్కోవాకు ఏమైనా అయితే.. ఆమె ఇంతకుముందు చేసినవి కూడా వేస్తారా? అని అంటాడు. ఈ సందర్భంగా జోక్ బీభత్సంగా పేలింది. సుధీర్ డైలాగ్స్ వచ్చినంత సేపు నవ్వులే నవ్వులు.


    కాగా, మియా మాల్కోవా.. అమెరికన్ పోర్న్ స్టార్. పలు పోర్న్ సినిమాల్లో, వీడియోల్లో నటించిన ఈమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌‌లో నటించింది. మహిళల శరీరం గురించి, శరీర వాంఛల గురించి ఇందులో మాల్కోవా చెప్పింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు