Sudigali Sudheer - Rashmi: బుల్లితెరలో సుధీర్, రష్మీ జంట గురించి అందరికి తెలిసిందే. ఈ జంట బుల్లితెరపై చేసే సందడి మాత్రం అంతా ఇంతా కాదు. బాగా రచ్చ చేస్తూ అందరి నోళ్లలో నిలిచారు. పైగా వీరి గురించి బయట కూడా నానారకాలుగా మాట్లాడేసుకున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుండి పరిచయమయ్యారు రష్మీ, సుధీర్. రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక స్టార్ కమెడియన్ గా నిలిచి వెండితెరపై కూడా మెప్పించాడు సుడిగాలి సుధీర్.
ఇక వీళ్ళ మధ్య ఉన్న బంధం చూసినట్లయితే వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అనే అనుమానం వస్తుంది. నిజానికి వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ వినిపించింది. ఈ షో లోనే కాకుండా బుల్లితెరలో ప్రసారమౌతున్న పలు షోలలో కూడా బాగా రచ్చ చేస్తుంటారు. ఇక గతంలో బుల్లితెర వేదికగా వీరి పెళ్లి కూడా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ జబర్దస్త్ వేదికలో వీరి ప్రపోజల్ వైరల్ గా మారింది.
https://youtu.be/6wRw_15-Gew
తాజాగా హైపర్ ఆది పెళ్లిళ్ల స్కిట్ తో ముందుకొచ్చాడు. ఇందులో సుధీర్, రష్మీ ఓ జంటగా.. హైపర్ ఆది, దీపిక పిల్లి మరో జంటగా బాగా సందడి చేశారు. ఇక ఇందులో రష్మీ.. సుధీర్ ను ఒకవేళ ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివని ప్రశ్నించింది. ఇక వెంటనే సుధీర్.. తన ప్రేమ కోసం వంద సార్లు మరణించైనా ఒక్కసారి జన్మిస్తానంటూ.. ఆ సూర్యరశ్మి ఉన్నంతకాలం ఈ సుధీర్ రష్మీ ఉంటారని ఓ కవిత రూపంలో తెలిపాడు. ఇక రష్మీ సిగ్గుపడుతూ నవ్వుతుండగా.. వెంటనే హైపర్ ఆది ఇదిగో రష్మీ.. నువ్వు ఆ వోలేటి లక్ష్మీల వయ్యారాలుపోమాకు. సూర్యరశ్మి అంటే పగలే ఉంటుంది.. మరి వీడు రాత్రి ఎక్కడ ఉంటాడో అడుగు అని కౌంటర్ వేసాడు.ఇక ఈ ఎపిసోడ్ లో వీళ్ళ పెళ్లి లతో బాగా సందడి గా అనిపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi, Deepika pilli, Hyper aadi special skit, Jabardasth, Sudigali sudheer