తనకు వచ్చిన వ్యాధిపై స్పందించిన సుడిగాలి సుధీర్..

సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్

Jabardasth Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని అందిస్తున్న రీల్ హీరో. హీరోగా, డ్యాన్సర్‌గా, కమెడియన్‌గా, మెజీషియన్‌గా, యాంకర్‌గా.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు.

  • Share this:
    సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని అందిస్తున్న రీల్ హీరో. హీరోగా, డ్యాన్సర్‌గా, కమెడియన్‌గా, మెజీషియన్‌గా, యాంకర్‌గా.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చినా ఆ తర్వాత పలు షోలలో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. కెమెరా ముందుకు వచ్చాడంటే నవ్వులు పండించే సుధీర్.. తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడట. ఒక్కోసారి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉండేదట. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని చూసి అమ్మమ్మ కుటుంబమే ఫీజులు కట్టేదట. భోజనం కూడా వాళ్లే పెట్టేవారట. ఈ విషయాన్ని సుధీరే స్వయంగా చెప్పాడు. అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్.. తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెల్లడించాడు. ఓ ఏడాది పాటు వెన్నునొప్పితో తీవ్రంగా బాధపడ్డానని, ఆ సమయంలో జీవితంపై తీవ్ర ఆందోళన చెందానని తెలిపాడు.

    తనకిష్టమైన నటనకు దూరం అవుతాననే బాధ ఎక్కువగా ఉండేదని, వెన్ను పూసలో ఉండే ఓ నరానికి ట్యూమర్ రావడంతో ఈ సమస్య వచ్చిందని.. అప్పుడు ఒంటరిగా, కారులో కూర్చొని నాలో నేనే ఏడ్చేవాడినని చెప్పాడు. జీవితంలో కష్టాలు చాలా నేర్పాయని, ఇప్పుడు నానమ్మతో సహా అందర్ని పోషిస్తుండటం చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. ఒకానొక సందర్భంలో విజయవాడలో పిల్లలకు డ్యాన్స్ కూడా నేర్పానని వివరించాడు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: