తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ కంటే రొమాంటిక్ కపుల్ మరోటి ఉండదేమో..? వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సుధీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రష్మి గౌతమ్. ఏడేళ్లుగా ఈ ఇద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు. పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఈ ఇద్దరి మధ్య ఉందంటారు కొందరు వాళ్ల కామన్ ఫ్రెండ్స్. అయితే వాళ్లు కేవలం స్నేహితులు మాత్రమే అని.. అంతకుమించి యూ ట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చినట్లు ఎలాంటి రిలేషన్ లేదని చెప్తుంటారు. ఇప్పుడు కూడా ఈ ఇద్దరిపైనే న్యూ ఇయర్ ప్రోమో కట్ చేసారు. ఆ ఇద్దరికి ఉన్న క్రేజ్ గురించి తెలుసు కాబట్టే నిర్వాహకులు కూడా ఈ ఇద్దరిపైనే ఈవెంట్ ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్‌లో కూడా సుధీర్, రష్మి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. న్యూ ఇయర్ ఈవెంట్ భారీగానే ప్లాన్ చేసారు ఈటీవీ నిర్వాహకులు. డిజే పేరుతో వస్తున్న ఈ ఈవెంట్‌లో అనసూయ భరద్వాజ్, రోజా, ప్రదీప్‌తో పాటు కొరియోగ్రఫర్ బాబా భాస్కర్, హీరో కార్తికేయ, ఒకప్పటి హీరోయిన్ ఆమని కూడా ఉన్నారు.
అందరితో పాటు హైపర్ ఆది, వర్షిణి కూడా ఉన్నారు. ఈ షో కోసం అందరూ చేసిన డాన్సులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యురేకా సకామికా అంటూ సుధీర్, రష్మి అదరగొట్టారు. నవ్వింది మల్లెచెండు అంటూ సూపర్ స్టెప్పులతో ఇరగదీసారు ఈ జోడీ. అప్పట్లో చిరంజీవి, విజయశాంతి మాదిరే ఇప్పుడు రెట్రో డాన్సులతో పిచ్చెక్కించారు. వాళ్ళ తర్వాత ఆకుచాటు పిందె తడిసే అంటూ హైపర్ ఆది, వర్షిణి కూడా అదరగొట్టారు. ఏదేమైనా కూడా న్యూ ఇయర్ ప్రోమో మాత్రం ఇప్పుడు యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood