తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ కంటే రొమాంటిక్ కపుల్ మరోటి ఉండదేమో..? వాళ్లు కనిపిస్తే చాలు టిఆర్పీ రేటింగ్స్ కూడా పరుగులు తీస్తూ వస్తుంటాయి. అందుకే వాళ్లతో ప్రోగ్రామ్స్ చేయడానికి ఛానెల్స్ కూడా పోటీ పడుతుంటాయి. ఎప్పటికప్పుడు ఈ ఇద్దరి మధ్య జరిగే రొమాంటిక్ డ్రామాను క్యాష్ చేసుకోడానికి సిద్ధంగా ఉంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా రష్మి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు సుడిగాలి సుధీర్. ఏడేళ్లుగా ఈ ఇద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు. పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఈ ఇద్దరి మధ్య ఉందంటారు కొందరు వాళ్ల కామన్ ఫ్రెండ్స్. అయితే వాళ్లు కేవలం స్నేహితులు మాత్రమే అని.. అంతకుమించి యూ ట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చినట్లు ఎలాంటి రిలేషన్ లేదని చెప్తుంటారు. ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఈ ఇద్దరిపైనే ప్రోమో కట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే చేసారు.
తాజాగా జబర్దస్త్ కామెడీ షోలో కూడా రష్మి, సుధీర్ మధ్య రిలేషన్‌ను మరోసారి వాడుకున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ షోలో తమ మధ్య ప్రేమను చూపించుకున్నారు. అయితే అదంతా స్క్రిప్ట్ అని తెలిసినా కూడా అభిమానులు కూడా ఎప్పుడూ అలాగే చూస్తుంటారు. సుధీర్, రష్మిని చూపిస్తూ అలా లవ్ సింబల్ గీస్తే చాలు ఫిదా అయిపోతారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.
తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజీపై సుధీర్ బర్త్ డే వేడుకలు జరిగాయి. అక్కడ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు సుధీర్‌ను పిలిచి కేక్ కూడా కట్ చేయించారు. మీరేనా.. ఇంకెవరూ గెస్టులు రాలేదా అంటూ రష్మి వైపు చూస్తూ అడుగుతాడు సుధీర్. దాంతో అక్కడే ఉన్న రష్మి వచ్చి సుధీర్‌కు కేక్ కట్ చేసి తినిపిస్తుంది. ఆ తర్వాత రష్మికి కేక్ పెడతాడు సుధీర్. అదేంటి ముందు అమ్మా నాన్నకు కదా పెడతారు అంటే నాకు అమ్మనాన్న కంటే నువ్వే ఎక్కువ.. అన్నీ నువ్వే అంటూ ఐస్ చేసాడు సుడిగాలి సుధీర్. ఆ ఒక్క డైలాగ్‌తో మళ్లీ ఇద్దరికి లవ్ సింబల్ వేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతుంది. అయినా సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ మధ్య ప్రేమ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rashmi Gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood