జబర్దస్త్ సుడిగాలి సుధీర్‌‌కు పెళ్లి చూపులు.. రష్మీ గౌతమ్‌కు షాక్..

Jabardasth Sudigali Sudheer : రష్మీ, సుడిగాలి సుధీర్ బంధం ఎవ్వరూ చెప్పలేనిది. వీరిద్దరు ప్రేమ పక్షులని, బుల్లి తెరపై కురిపించే రొమాన్స్.. సినిమాల్లోకన్నా ఎక్కువగా ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు అంటుంటారు.

news18-telugu
Updated: October 22, 2019, 8:10 AM IST
జబర్దస్త్ సుడిగాలి సుధీర్‌‌కు పెళ్లి చూపులు.. రష్మీ గౌతమ్‌కు షాక్..
రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ (Source: Youtube)
  • Share this:
ప్రతి వారం వచ్చే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు ప్రేక్షకులను కడుపు నిండా నవ్వుకునేలా చేస్తాయి. నాగబాబు, రోజా జడ్జిల కాంబినేషన్‌లో నిర్వహించే కామెడీ షోలు కిర్రాక్ పుట్టిస్తాయి. అందుకే.. ఆ స్కిట్లలో చేసే టీమ్ లీడర్లు, ఇతర ఆర్టిస్టులకు బోలెడంత పేరు. అందరికంటే ఎక్కువగా సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడు కామెడీ ఆర్టిస్టే అయినా.. గర్ల్స్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుంది. అందుకే.. సుధీర్ ఏ షో చేసినా ప్రధాన పాత్ర కచ్చితంగా అతడిదే ఉంటుంది. ఇక.. అతడితో రష్మీ బంధం ఎవ్వరూ చెప్పలేనిది. వీరిద్దరు ప్రేమ పక్షులని, బుల్లి తెరపై కురిపించే రొమాన్స్.. సినిమాల్లోకన్నా ఎక్కువగా ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు అంటుంటారు. ప్రేక్షకులకు కనువిందు చేసేలా రష్మీ, సుధీర్ ఇంకా ఎక్కువ రొమాన్స్ పండిస్తూ, పంచ్‌లు వేసుకుంటూ నవ్వుల్ని పూయిస్తారు. అదీకాక.. ఆ మధ్య వీళ్లిద్దరి పెళ్లి చేసినట్లు చేసిన ఓ షో.. బీభత్సమైన రేటింగ్‌ను సాధించింది. అందుకే.. వీరిద్దరి మధ్య పెళ్లి, సంసారం అన్న మాటలు వినిపిస్తే చాలు.. ప్రేక్షకులు చెవులు రిక్కించి మరీ వింటారు. దీన్ని క్యాచ్ చేసుకొని నిర్వాహకులు కూడా దానికి తగ్గట్లు వీరిని మరింత ప్రోత్సహిస్తారు.

అయితే, తాజాగా.. వచ్చే గురువారం నాటి ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్.. పెళ్లి చూపులకు సంబంధించిన స్కిట్ వేశాడు. ఈ సందర్భంగా పెళ్లి సంబంధాలు చూడాలని తోటి ఆర్టిస్టును అడుగుతాడు. పెళ్లి చేసుకొని ఏం చేస్తావని అడగ్గా.. సంసారం చేస్తామని అంటాడు. సంసారం చేసి ఏం చేస్తావని అడిగితే కూడా.. సంసారమే చేస్తామని అంటాడు సుధీర్. దానికి రష్మీ కౌంటర్ ఇస్తుంది. ఆ కౌంటర్ బాగా పేలిపోయింది. సుధీర్‌ను రష్మీ ఏడిపిస్తే.. ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతారని ఇలా చేయడం గమనార్హం. స్కిట్‌లో భాగంగా.. పెళ్లి సంబంధం చూస్తున్నారా? అని సుధీర్ అనగానే అమ్మాయి రిజెక్ట్ చేసిందా అంటూ రష్మీ అనడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్లు అనిపించింది. ఇలా, తన స్కిట్‌లో సుధీర్ మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చి.. వార్తల్లో నిలుస్తున్నాడు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading