సుడిగాలి సుధీర్ ఆ విషయంలో చాలా వీక్.. సాక్ష్యం ఇదిగో..

జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆ విషయంలో చాలా వీకా.. అంటే అవుననే చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: January 26, 2020, 8:15 PM IST
సుడిగాలి సుధీర్ ఆ విషయంలో చాలా వీక్.. సాక్ష్యం ఇదిగో..
తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.
  • Share this:
జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆ విషయంలో చాలా వీకా.. అంటే అవుననే చెబుతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి ‘త్రీ’ మంకీస్ మూవీస్ చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను బ్రహ్మానందం  విడుదల చేసారు. ఈ ట్రైలర్‌లో సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఫ్రెండ్స్. వీళ్లకు పెళ్లి ముందు ఒక అమ్మాయితో గడపాలనుకుంటారు. ఈ సందర్భంగా చోటు చేసుకునే పరిణామాలతో ఈ ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించింది. చివర్లో కాస్తంత ఎమోషన్ టచ్ కూడా ఇచ్చారు. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. రీసెంట్‌గా సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘సాఫ్ట్‌‌వేర్ సుధీర్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మొత్తంగా చూసుకుంటే జబర్ధస్త్ కమెడియన్స్ స్మాల్ స్క్రీన్ పై రాణించినంతగా వెండితెరపై రాణించలేకపోతున్నారు. మరి ఈ సినిమాతోనైనా ’3 మంకీస్’ అదే నండి సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను హీరోలుగా సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.

Published by: Kiran Kumar Thanjavur
First published: January 26, 2020, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading