JABARDASTH STAR HYPER AADHI TWEETS ON LOSS OF JANA SENA PARTY AFTER ELECTION RESULTS CR
ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు... జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్...
పవన్ కళ్యాణ్,హైపర్ ఆది
ఈరోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు... తెలుగు ప్రజలు... ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇది బ్లాక్ డే... మానవత్వంపై డబ్బు, మద్యం గెలిచాయి... ట్విట్టర్లో ఎమోషనల్ అయిన హైపర్ ఆది... ‘జబర్దస్త్’ కమెడియన్ ట్వీట్‌పై హాట్ చర్చ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దామనుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కు తెలుగు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ‘వస్తున్నాం... మారుస్తున్నాం...’ అంటూ జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్... ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందారు. రెండు చోట్ల పోటీ చేసిన జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ కూడా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయారు. గాజువాక, భీమవరం రెండు నియోజికవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడారు పవన్ కల్యాణ్. గాజువాకలో వైసీసీ అభ్యర్థి నాగిరెడ్డి... పవన్ కల్యాణ్‌పై విజయం సాధిస్తే... భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ ప్రగల్భాలు పలికిన ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది... ఎన్నికల ఫలితాల అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘జనసైనికులకు సారీ... మనం రెండు చోట్లా ఓడిపోయాం’ అంటూ ట్వీట్ చేసిన హైపర్ ఆది... ‘ఈరోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు... తెలుగు ప్రజలు... ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బ్లాక్ డే’... అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు హైపర్ ఆది. ‘మద్యం... డబ్బు ముందు మానవత్వం చచ్చిపోయింది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు హైపర్ ఆది.
జనసేన పార్టీ ప్రచారంలో హైపర్ ఆది
పవన్ కల్యాణ్ వీరాభిమానినంటూ సగర్వంగా ప్రకటించుకున్న హైపర్ ఆది... తన స్కిట్స్‌లో అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కల్యాణ్‌పై, మెగా ఫ్యామిలీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జబర్దస్త్’ జడ్జి నాగబాబు కోసం ఆయన నియోజికవర్గంలో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించాడు హైపర్ ఆది. అయితే వైసీపీ ఫ్యాన్ సునామీ ముందు ‘గ్లాస్’ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్క రాజోలు అసెంబ్లీ నియోజికవర్గం మాత్రం జనసేన పార్టీకి దక్కింది. అధికార టీడీపీ ఓట్లు చీల్చడం తప్ప, జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో సాధించిదేమీ లేదు. దాంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తమ బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రోజా
అయితే మిగిలిన అభిమానులు వేరు, హైపర్ ఆది వేరు. ఓ సాధారణ కమెడియన్‌గా ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది... తన పవర్ఫుల్ పంచ్‌లతో కామెడీ టైమింగ్‌తో మంచి కమెడియన్‌గా ఎదిగాడు. అలాంటి కమెడియన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టింది ‘జబర్దస్త్’ జడ్జ్ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ సీపీ. నాగబాబుకు మద్ధతుగా ప్రచారం కూడా చేసిన హైపర్ ఆది... రోజా పార్టీని నిందిస్తూ ట్వీట్ పెట్టడం పెద్ద సంచలనమే క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి రోజా, హైపర్ ఆది ట్వీట్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.