జబర్దస్త్ గెటప్ శ్రీనుకు ఘోర అవమానం.. తినే కంచం లాగేసి..

Jabardasth Comedy Show: కొందరు జబర్దస్త్ కమెడియన్స్ జీవితంలో కూడా చాలా చీకటి కోణాలున్నాయి. కాకపోతే ఇప్పుడు వాళ్లు సక్సెస్ అయ్యారు కాబట్టి వాటి గురించి ఎవరికీ తెలియదంతే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 29, 2020, 6:33 PM IST
జబర్దస్త్ గెటప్ శ్రీనుకు ఘోర అవమానం.. తినే కంచం లాగేసి..
గెటప్ శ్రీను
  • Share this:
ప్రతీ ఒక్కరికి జీవితంలో వెలుగు మాత్రమే కాదు చీకటి కూడా ఉంటుంది. అయితే గెలిచిన తర్వాత వచ్చే వెలుగు.. ఓటమిలో ఉన్నపుడు ఉండే చీకటిని కవర్ చేస్తుందంతే. కానీ అది మాత్రం అలాగే చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాగే కొందరు జబర్దస్త్ కమెడియన్స్ జీవితంలో కూడా చాలా చీకటి కోణాలున్నాయి. కాకపోతే ఇప్పుడు వాళ్లు సక్సెస్ అయ్యారు కాబట్టి వాటి గురించి ఎవరికీ తెలియదంతే. ఇలాంటి చేదు అనుభవాలు తన జీవితంలో కూడా ఉన్నాయంటున్నాడు గెటప్ శ్రీను. జబర్దస్త్ కమెడియన్‌గా ఈయనకు తిరుగులేదు. నాగబాబుతో బుల్లితెర కమల్ హాసన్ అనిపించుకున్నాడు శ్రీను.

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Source: Twitter)
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను (Source: Twitter)


అలాంటి గెటప్ శ్రీనుకు జీవితంలో కొన్ని అనుభవాలు దారుణంగా దెబ్బతీసాయి. సినిమా అవకాశాల కోసం 2007లో హైదరాబాద్‌కి వచ్చినపుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమా ఓపెనింగ్ జరుగుతుంటే అక్కడ హీరోను చూద్దామని వచ్చాడు శ్రీను. తెలిసిన వాళ్లు ఉండటంతో లోపలికి వచ్చి ఓపెనింగ్ చూసిన తర్వాత తినడానికి కూర్చున్నాడు. అయితే అప్పుడే ఆ సినిమా నిర్మాత వచ్చి ఎవడ్రా నువ్వు అని అడిగాడని.. తనకు తెలిసిన వాళ్ల నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పేలోపే.. బండ బూతులు తిట్టి.. తినే కంచాన్ని కూడా లాగేసి తనను మెడబట్టుకు బయటికి గెంటేసారని చెప్పాడు శ్రీను.

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి (getup srinu chiranjeevi)
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చిరంజీవి (getup srinu chiranjeevi)


అప్పుడు చాలా ఏడ్చానని.. అసలు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్లానా అని ఇప్పటికీ తలుచుకుని ఏడుస్తుంటానని చెప్పాడు గెటప్ శ్రీను. ఆ రోజు గెంటేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో కచ్చితంగా ఏదో ఓ రోజు దర్జాగా వెళ్లాలనుకున్నానని.. ఇప్పుడు జబర్దస్త్ షూటింగ్ అక్కడే జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసుకుని గర్వంగా ఉంటుందని చెప్పాడు గెటప్ శ్రీను. అప్పట్లో తాను నాగోల్‌లో ఉండేవాడినని.. అక్కడ్నుంచి జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వచ్చి ఆఫర్స్ కోసం తిరిగే వాడినని చెప్పాడు శ్రీను.

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను (sudheer getup srinu)
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను (sudheer getup srinu)


సికింద్రాబాద్‌లోని ఓ ఫోటో స్టూడియోలో ఫోటోలు దిగి వాటిని అన్ని ఆఫీసులకు పంచేవాడినని చెప్పాడు ఈయన. అలాగే మరోసారి ఓ నిర్మాత ఫోన్ చేసి ఆఫర్ ఇస్తానన్నాడని.. అతడు చెప్పిన టైమ్‌కు ఫోన్ చేసి గుర్తు చేసినా కూడా బూతులు తిట్టాడని చెప్పాడు శ్రీను. ఇలా కెరీర్ మొదట్లో చాలా అవమానాలు పడ్డట్లు గుర్తు చేసుకున్నాడు గెటప్ శ్రీను. కానీ ఎన్ని జరిగినా కూడా తినే అన్నం నుంచి లేపి బయటికి గెంటేసిన అన్నపూర్ణ సీన్ మాత్రం ఇప్పటికీ తనకు గుర్తుండిపోయిన అవమానం అని చెప్పాడు ఈ కమెడియన్.
Published by: Praveen Kumar Vadla
First published: May 29, 2020, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading