Home /News /movies /

JABARDASTH SHOW SHOOTING GOING TO CANCEL DUE TO ROJA HERE ARE THE DETAILS SR

Jabardasth : రోజా కారణంగా జబర్దస్త్ షో క్యాన్సల్ కానుందా..

జబర్దస్త్ షోలో  MLA రోజా Photo : Youtube

జబర్దస్త్ షోలో MLA రోజా Photo : Youtube

Jabardasth : నటి, రాజకీయ నాయకులు, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.

    నటి, రాజకీయ నాయకులు, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ప్రస్తుతం సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. అది అలా ఉంటే ఆమె ఓ వైపు అటు రాజకీయాలు చేస్తూనే.. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్‌లో కొన్ని సడలింపుల అనంతరం ప్రస్తుతం ఈ షో వారానికి రెండు సార్లు షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రోజా గన్ మెన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో.. జబర్దస్త్ షూటింగ్‌లో పాల్గొనలంటే నటులు భయపడుతున్నారట. ఎక్కడ కరోనా సోకుతుందో అని అందోళన చెందుతున్నారట. దీంతో మల్లేమాల యాజమాన్యం కూడా కొన్ని రోజులు పాటు షూటింగ్ వాయిదా వెయ్యాలనీ నిర్ణయించదట. ఈ నేపథ్యంలో కొత్త ఎపిసోడ్ ప్రసారానికి తిప్పలు తప్పేలా లేవని అంటున్నారు. ఒక వేళ రోజా క్వారెంటైన్‌లో ఉంటూ షూటింగ్‌కు రాకపోతే ఆమె బదులు మరో గెస్ట్ వచ్చే ఆస్కారం ఉంది. ఆ విధంగా షోను మరోసారి ఆపకుండా ప్రసారం చేసే ఛాన్స్ ఉంది. నాగబాబు జబర్దస్త్‌‌ను వదిలి వెళ్లిన తర్వాత ప్రస్తుతం షోలో రోజాతో పాటు గాయకుడు మనో జడ్జ్‌గా చేస్తున్నాడు.

    ఇక కరోనా వల్ల టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ భారతీయ నటుడు అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Jabardasth, MLA Roja, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు