అనసూయ- హైపర్ ఆది కెమిస్ట్రీపై రైజింగ్ రాజు ఏమన్నాడంటే..

నాగబాబు చాలా మంచివారని చెప్పారు రాజు. ఇటీవల జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ సమస్య వచ్చిందని.. అప్పుడు అందరి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి సాయం చేశారని వెల్లడించారు. జబర్దస్త్ టీమంతా ఒక కుటుంబమని చెప్పారు.

news18-telugu
Updated: October 3, 2019, 8:03 PM IST
అనసూయ- హైపర్ ఆది కెమిస్ట్రీపై రైజింగ్ రాజు ఏమన్నాడంటే..
అనసూయ, ఆది
  • Share this:
బుల్లితెరపై జబర్దస్త్ సంచలనాలేంటో అందరికీ తెలిసిందే. గురు,శుక్ర వారాల్లో టీవీల్లో జబర్దస్త్ కమెడియన్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. పటాకుల్లాంటి పంచులు పేల్చి అందరిలోనూ నవ్వులు పూయిస్తారు. దీనికి తోడు రష్మి-సుధీర్ జంటకు జనాల్లో బీభత్సమైన క్రేజ్ ఉంది. ఇటీవలే జబర్దస్త్ స్టేజిపై కొత్త కెమిస్ట్రీ నడుస్తోంది. అదే యాంకర్ అనసూయ, హైపర్ ఆది అల్లరి..! గ్యాప్ లేకుండా పంచులేసే ఆది..ఈ మధ్య వరసగా అనసూయతో స్టెప్పులేస్తున్నాడు. స్కిట్‌లోనూ ఆమెతో డైలాగ్‌లు చెప్పిస్తున్నాడు. దాంతో రష్మి-సుధీర్ మాదిరిగానే.. అనసూయ-ఆది జంటకు ఫాలోయింగ్ పెరుగుతోంది.

వీరిద్దరి కెమిస్ట్రీపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆది-అనసూయ జంటపై జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. స్కిట్‌లో ఏదైనా ఒక బిట్ జనాల్లోకి బాగా వెళ్తే.. అలాంటి వాటిపై డైరెక్టర్‌లు ఎక్కువగా స్కిట్‌లు రాస్తారని చెప్పుకొచ్చారు. ఆది-అనసూయ కెమిస్ట్రీ కూడా అలాంటిదేనని స్పష్టం చేశారు. తామంతా ఒక కుటుంబమని.. అనసూయను తమ సోదరిగా, కూతురిగా భావిస్తామని స్పష్టంచేశారు.
అనసూయ-హైపర్ ఆది, సుడిగాలి సుధీర్-రష్మీ కెమిస్ట్రీపై ఎక్కువగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా చిన్న బిట్టుపడి అది జనాల్లోకి వెళ్తే.. దాని అలాగే కొనసాగిస్తారు. ఇంకొన్ని ఎపిసోడ్‌లు ప్లాన్ చేస్తారు. అంతేతప్ప అందరిలోనూ స్నేహ భావమే ఉంటుంది. మాకు, జడ్జిలకు తల్లిదండ్రులు-పిల్లలకుండే అనుబంధం ఉంటుంది. అనసూయ నన్ను బాబాయ్ అని పిలుస్తుంది. జబర్దస్త్‌లో సోదర భావాలేే ఎక్కువగా ఉంటాయి. అనసూయను చెల్లి, అక్కగా భావిస్తారు. అంతేతప్ప కెమిస్ట్రీ అంటూ భూతద్దంలో చూడొద్దు.
రైజింగ్ రాజు


నాగబాబు చాలా మంచివారని చెప్పారు రాజు. ఇటీవల జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ సమస్య వచ్చిందని.. అప్పుడు అందరి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి సాయం చేశారని వెల్లడించారు. జబర్దస్త్ టీమంతా ఒక కుటుంబమని చెప్పారు. ఏ సమస్య వచ్చినా శ్యామ్ ప్రసాద్, నాగబాబు తమకు అండగా ఉంటారని తెలిపారు రైజింగ్ రాజు. జనాల వల్లే తాము బతుకుతున్నామని.. వారిని హర్ట్ చేసే పనులు ఎప్పుడూ చేయమని స్పష్టచేశారు.
First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు