జబర్దస్త్‌‌‌లో మార్పులు.. రేటింగ్ కోసం తిప్పలు..

Jabardasth : కామెడీ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే కామెడీ అన్నట్లు అయిపోయింది. నవ్వులు కావాలంటే గురువారం, శుక్రవారం వరకు వెయిట్ చేయండి అన్నట్లు అయిపోయింది ఇప్పటి పరిస్థితి.

news18-telugu
Updated: December 2, 2019, 5:00 PM IST
జబర్దస్త్‌‌‌లో మార్పులు.. రేటింగ్ కోసం తిప్పలు..
జబర్దస్త్ లోగో
  • Share this:
కామెడీ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే కామెడీ అన్నట్లు అయిపోయింది. నవ్వులు కావాలంటే గురువారం, శుక్రవారం వరకు వెయిట్ చేయండి అన్నట్లు అయిపోయింది ఇప్పటి పరిస్థితి. ఆ షోలో పండించే కామెడీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని, నవ్వుల విందును అందిస్తుంది. పెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా ఈ షోకు ఫ్యాన్ అయిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు.. జబర్దస్త్ స్టామినా ఏంటో. అయితే.. జబర్దస్త్‌కు పోటీగా ఈ మధ్య వచ్చిన లోకల్ గ్యాంగ్స్ ఎఫెక్ట్‌తో మల్లెమల నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నాడు. కొత్త షో వల్ల రేటింగ్ పడిపోయే అవకాశం ఉన్నందున ఆ షో ప్రభావం జబర్దస్త్‌పై పడకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగబాబు, అనసూయ, చమ్మక్ చంద్ర.. తదితరులు కొత్త షోకు జంప్ అవడంతో ప్రేక్షకులు కొత్త షోకు మళ్లే అవకాశం ఉందని గ్రహించి నిర్వాహకులు కొత్త పంథాకు తెరతీశారని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

వాస్తవానికి.. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించిన టీమ్ లీడర్లు స్వంతంగా ఆర్టిస్టులను తెచ్చుకొని, వారితో కామెడీ చేయించేవాళ్లు. ఇప్పటి వరకు ఆర్టిస్టులు ఒక టీమ్ నుంచి మరో టీమ్‌కు వెళ్లేవాళ్లు కాదు... అయితే, ఈ మధ్య ఒక టీమ్‌కు చెందిన ఆర్టిస్టులు, టీమ్ లీడర్లు మరో స్కిట్‌లో కనిపిస్తున్నారు. గత వారం ఎపిసోడ్‌, వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోల్లో ఆర్టిస్టులు పలు స్కిట్లలో నటించారు. దీన్ని బట్టి చూస్తే.. కొత్త షోకు ప్రేక్షకులు మళ్లకుండా ఆర్టిస్టులను వీలైనంతగా వాడుకుంటున్నారని సినీ విశ్లేషకులు వెల్లడించారు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>