హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్‌లో మీనా ప్లేస్ పర్మినెంట్ కాదా... మరి రోజా ప్లేస్‌లో నెక్ట్స్ ఎంట్రీ ఎవరు...

జబర్దస్త్‌లో మీనా ప్లేస్ పర్మినెంట్ కాదా... మరి రోజా ప్లేస్‌లో నెక్ట్స్ ఎంట్రీ ఎవరు...

మీనా,రోజా

మీనా,రోజా

మీనా జబర్దస్త్ జడ్జీగా కొనసాగడం కష్టమే అంటున్న ప్రేక్షకులు... కామెడీని ఎంజాయ్ చేయలేక, మీనా నవ్వడానికి ఇబ్బంది పడుతుండడాన్ని కనిపెట్టేసిన జబర్దస్త్ ఫ్యాన్స్‌... ఆ స్థానంలో మరో సీనియర్ హీరోయిన్‌ను తెచ్చేందుకు జబర్దస్త్ టీమ్ ప్రయత్నాలు?...

ఇంకా చదవండి ...

జబర్దస్త్ కామెడీ షో అనగానే ముందుకు గుర్తొచ్చేది ‘జబర్దస్త్’ జడ్జీలు రోజా, నాగబాబులే. స్క్రిట్స్‌లో చేసే కామెడీ చూసి నవ్వేవారి కంటే రోజా, నాగబాబుల రియాక్షన్ చూసి నవ్వుకుంటుంటారు చాలామంది. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యారు రోజా, నాగబాబు. జబర్దస్త్ టీవీ షో వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు కూడా వీరు ఈ ప్రోగ్రామ్‌కు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. వయసు పెరిగినా, గ్లామర్ తగ్గించని రోజా... డ్యాన్సులతో ఇరగదీస్తుంటే... నాగబాబు తన స్టైల్ సిగ్నేచర్‌తో, యాటిట్యూడ్‌తో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. అయితే అనుకోకుండా ఇప్పుడు ఈ ఇద్దరు జబర్దస్త్ జడ్జీలు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. నాగబాబు, తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ తరుపున నరసాపురం ఎంపీగా పోటీగా చేస్తుంటే... రోజా తాను ఎమ్మెల్యేగా ఐదేళ్లు సేవలందించిన నగరి ఏరియా నుంచే మరోసారి బరిలో నిలిచింది. ఇద్దరూ ప్రచార కార్యక్రమాల్లో యమా బిజీగా ఉండి, జబర్దస్త్ షోకి రాలేకపోయారు. దాంతో వీరి స్థానంలో సీనియర్ హీరోయిన్ మీనా, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. జబర్దస్త్ జడ్జీలుగా మెరిశారు. జానీ మాస్టర్ ఫుల్ జోష్‌లో కనిపిస్తూ, పార్టిసిపెంట్స్ చేసే కామెడీకి పడి పడి నవ్వుతున్నా... రోజా స్థానంలో ఎంట్రీ ఇచ్చిన మీనా మాత్రం కామెడీని అంతగా ఎంజాయ్ చేయలేకపోతోంది. మీనా నవ్వడానికి ఇబ్బంది పడుతుండడం ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతోంది. టీవీలో చూసి ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చిన మీనాకు లైవ్‌లో పొజిషన్ చూసి షాక్ తగిలిందట. ఎడిటింగ్‌కు రఫ్ కామెడీ చూసి ఎలా నవ్వాలో తెలియక తెగ ఇబ్బంది పడుతోంది మీనా.

roja,jabardasth comedy show roja,nagababu,nagababu roja jabardasth comedy show, roja quits jabardasth tv show,roja next move,mla roja,mla roja becomes minister,anasuya,rashmi gautham, nagababu janasena,janasena nagababu narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show new jedges,tollywood news,telugu cinema,జనసేన, జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ రోజా,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,నగరి ఎమ్మెల్యే రోజా,మీనా జబర్దస్త్,జానీ జబర్దస్త్,రోజా మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,నాగబాబు జనసేన ఎంపీ, జబర్దస్త్ కొత్త జడ్జీలు, జబర్ధస్త్ మీనా ప్లేస్‌లో,వైఎస్ఆర్‌సీపీ
జబర్దస్త్ షో ద్వారా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రష్మీ గౌతమ్... సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకుంటోంది...


మీనా జబర్దస్త్ జడ్జీగా కొనసాగడం కష్టమే అంటున్నారు ప్రేక్షకులు. ఆమె స్థానంలో మరో సీనియర్ హీరోయిన్‌ను తీసుకురావాలని చూస్తున్నారు. వాస్తవానికి గట్టిగా నవ్వుతూ, పక్కనే ఉన్న నాగబాబును కొట్టి, కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేసే రోజా ప్లేస్ భర్తీ చేయాలంటే అంత తేలిగ్గా అయ్యే పని కాదు. అందుకే మళ్లీ రోజా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు జబర్దస్త్ ఫ్యాన్స్. అయితే ఈ సారి వైఎస్ఆర్ సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే గనుక రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్‌ను మిస్ కాకుండా వచ్చిన రోజా... మంత్రి అయితే మాత్రం టీవీ కార్యక్రమానికి వచ్చేంత తీరిక తనకు ఉండకపోవచ్చు. ఒకవేళ తీరక చేసుకుని జబర్దస్త్‌లో రీఎంట్రీ ఇచ్చినా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావచ్చు.

roja,jabardasth comedy show roja,nagababu,nagababu roja jabardasth comedy show, roja quits jabardasth tv show,roja next move,mla roja,mla roja becomes minister,anasuya,rashmi gautham, nagababu janasena,janasena nagababu narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show new jedges,tollywood news,telugu cinema,జనసేన, జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ రోజా,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,నగరి ఎమ్మెల్యే రోజా,మీనా జబర్దస్త్,జానీ జబర్దస్త్,రోజా మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,నాగబాబు జనసేన ఎంపీ, జబర్దస్త్ కొత్త జడ్జీలు, జబర్ధస్త్ మీనా ప్లేస్‌లో,వైఎస్ఆర్‌సీపీ
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా హాట్ హాట్ ఫోటోలతో ఫాలోవర్స్‌ను అలరిస్తూ, సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో మెరుస్తోంది...

అందుకే రోజాపై ఆశలు వదులుకున్న జబర్దస్త్ షో నిర్వహాకులు... మీనా స్థానంలో సీనియర్ హీరోయిన్ రాశి, రవళి, భానుప్రియ, ఆమని వంటి వాళ్లను తీసుకురావాలని చూస్తున్నారట. వీళ్లెవ్వరూ వీలు కాకపోతే సహాయ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హేమనైనా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే వీరిలో ఎవరు జబర్దస్త్ స్టేజ్ మీద మెరుస్తారోననేది ఇంకా ఇప్పుడప్పుడే తేలేది కాదు. సీనియర్ మోస్ట్ హీరోయిన్, నటి జయసుధతో ఇప్పటికే మంతనాలు జరిపినా, ఆమె ససేమీరా నో చెప్పేసిందట. సో... మీనా కూడా పరిస్థితిని అర్థం చేసుకుని, నవ్వడం నేర్చుకుంటుందా? అనేది కూడా చెప్పలేం. మరోవైపు తాను గెలిచి, ఎంపీగా బాధ్యతలు స్వీకరించినా జబర్దస్త్ షోను మాత్రం వదులుకోనని కన్ఫార్మ్ చేశాడు నాగబాబు.

First published:

Tags: Jabardasth comedy show, Meena, MLA Roja, Nagababu, Roja

ఉత్తమ కథలు