జబర్దస్త్ షో విషయంలో నాగబాబు సంచలన నిర్ణయం..

నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. ఐతే. సడెన్‌గా ఈ షో నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: November 15, 2019, 2:28 PM IST
జబర్దస్త్ షో విషయంలో నాగబాబు సంచలన నిర్ణయం..
నాగబాబు (file photo)
  • Share this:
నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. ఇక జబర్థస్త్ షోలో నాగబాబు నవ్వుల కోసమే ఈ షో చూసే వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ షోతో మెగా బ్రదర్.. స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా జబర్ధస్త్ షో అంటే కామెడీతో పాటు రోజా, నాగబాబు నవ్వులతో నపాటు వాళ్లు జడ్జ్‌మెంట్. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ నాగబాబు, రోజా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు కాస్త విరామిచ్చారు. నాగబాబు.. తన తమ్ముడు జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా  పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో నాగబాబు విజయం సాధించలేదు. దీంతో యదావిధిగా జబర్ధస్త్ జడ్జ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా.. రాజకీయాలే తన ప్రాధాన్యం అని చెప్పుకున్నారు.

Huge shock to Jabardasth Comedy Show and Judge Naga Babu will take complete responsibility pk ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వారంలో రెండు రోజులు కడుపులు చెక్కలైపోయేలా నవ్వించే ఈ షో అంటే అందరికీ ఇష్టమే. jabardasth comedy show,jabardasth comedy show nagababu,nagababu remuneration,jabardasth directors out,nithin bharath jabardasth,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
జబర్దస్త్ కామెడీ షో


తాజాగా నాగబాబు జబర్ధస్త్ ప్రోగ్రామ్ నుంచి శాశ్వతంగా పక్కకు తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీవీలో వస్తున్న జబర్థస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోగ్రామ్‌లని ముందుగానే షూట్ చేసినవి. ఐతే..నాగబాబు ఈ షో నుంచి పక్కకు తప్పుకోవడంపై వివిధ రకాల కారణాలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా జబర్థస్త్ షోను ఇన్నేళ్లుగా డైరెక్ట్ చేస్తున్న నితిన్-భరత్‌లను యాజమాన్యం తప్పించడంతో నాగబాబు హర్ట్ అయినట్టు చెబుతున్నారు. వారిద్దరితో  నాగబాబుకు మంచి అనుబంధం ఉంది. వాళ్లను సడెన్‌గా ఈ షో నుంచి  యాజమాన్యం పక్కకు తప్పించడంతో నాగబాబు తీవ్ర మనస్థాపానికి గురైనట్టు చెబుతున్నారు. నాగబాబు ఈ షో నుండి తప్పుకోవడంతో ఆయన ప్లేస్‌లో నాగబాబు రేంజ్ ఉన్న జడ్జ్‌తో రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. మొత్తానికి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న ఈ షోలో ఇలాంటివి జరగడం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. మరి జబర్ధస్త్ మేనెజ్మెంట్ నాగబాబును బుజ్జగించి మళ్లీ ఆయన్ని ఈ ప్రోగ్రామ్ చేసేటట్టు ఒప్పిస్తారా లేదా అనేది చూడాలి. లేకపోతే.. ఆయన పూర్తి దృష్టిని నాగబాబు రాజకీయాలకే కేటాయిస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...