జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్ మిస్.. కారణాలు ఇవేనా..

జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ వారం ప్రసారమైన ఎపిసోడ్‌లో హైపర్ ఆది లేని లోటు స్పష్టంగా కనిపించింది. అసలు హైపర్ ఆది జబర్ధస్త్ షోను ఎందుకు మిస్ చేసాడనే విషయానికొస్తే..

news18-telugu
Updated: August 23, 2019, 8:16 PM IST
జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్ మిస్.. కారణాలు ఇవేనా..
హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)
  • Share this:
జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. ఒక్క హైపర్ ఆది మాత్రమే  కాదు.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ల‌కు సినిమాలు అంత‌గా క‌లిసి రాలేదు. కానీ ఈ వారం  ఎపిసోడ్‌లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు ఒకింత నిరాత్సాహానికి గురైనట్టు సోషల్ మీడియా వేదికల్లో గట్టిగానే ప్రచారం జరగుతోంది. ఐతే.. జబర్ధస్త్ షోకు హైపర్ ఆది రాకపోవడానికి కారణం..ఆయనకు అతని టీమ్ మెంబర్స్ అమెరికా సహా పలు దేశాల్లో తెలుగు వాళ్లున్న చోట ప్రత్యేకంగా కొన్ని స్కిట్స్ చేయడానికి వెళ్లినట్టు సమాచారం.

Comedian Hyper Aadi opens about Adire Abhi and Jabardasth Show directors Nithin Bharath pk హైపర్ ఆది పేరు చెబితే యూ ట్యూబ్ షేక్ అయిపోతుంది. మనోడి ఒక్కో స్కిట్ 50 లక్షల వ్యూస్ వచ్చేస్తాయి. అంత పాపులారిటీ తెచ్చుకున్న ఆది.. ఒకప్పుడు ఎక్కడ్నుంచి వచ్చాడు అనేది అందరికీ ఆసక్తికరమే. hyper aadi,jabardasth comedian hyper aadi,jabardasth comedian hyper aadi skits,jabardasth comedian hyper aadi youtube skits,jabardasth comedian hyper aadi remuneration,jabardasth comedian hyper aadi movies,hyper aadi adire abhi,hyper aadi dailagues,jabardasth comedy show,jabardasth comedian hyper aadi interview,jabardasth comedian hyper aadi twitter,jabardasth comedian hyper aadi pawan kalyan,jabardasth comedian hyper aadi super hit skits,jabardasth comedian hyper aadi personal life,jabardasth comedian hyper aadi adhire abhi,jabardasth comedian hyper aadi comedy,jabardasth comedian hyper aadi naga babu,jabardasth comedy show rating,jabardasth TRP,roja jabardasth comedian hyper aadi,telugu cinema,హైపర్ ఆది,హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో,హైపర్ ఆది రెమ్యునరేషన్,హైపర్ ఆది ఇంటర్వ్యూ,హైపర్ ఆది పవన్ కళ్యాణ్,హైపర్ ఆది రోజా,హైపర్ ఆది నాగబాబు,తెలుగు సినిమా
హైప‌ర్ ఆది (Source: Facebook)


మరోవైపు హైపర్ ఆదికి మరలా సినీ అవకాశాలు తలుపు తట్టినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక హైపర్ ఆది స్వతహాగా రైటర్ కాబట్టి.. వేరే దర్శకులకు, రచయితలకు కామెడీ టైమింగ్‌లో సలహాలు సూచనలు కూడా చేస్తున్నట్టు సమాచారం. ఏమైనా ఉప్పు లేని పప్పు.. మసాలా లేని కూరలా ఇపుడు హైపర్ ఆది స్కిట్ లేని జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు కిక్కే రావడం లేదని అభిమానులు అంటున్నారు. గతంలో కూడా హైపర్ ఆది.. కొన్ని రోజులు జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు తాత్కాలింగా బ్రేక్ ఇచ్చాడు. ఏమైనా హైపర్ ఆది తొందర్లనే జబర్ధస్త్ షోకు వస్తే చూడాలనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు