Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌‌లోకి హైపర్ ఆది.. జబర్ధస్త్ కమెడియన్‌కు బంపరాఫర్..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. వచ్చే నెల నుంచి షూటింగ్స్‌ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే  మార్గదర్శకాలు విడుదల చేసింది. త్వరలోనే బిగ్‌బాస్ 4కు సన్నాహాలు మొదలైయ్యాయి. ఇందులో భాగంగా హైపర్ ఆది బిగ్‌బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: May 24, 2020, 7:30 PM IST
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌‌లోకి హైపర్ ఆది.. జబర్ధస్త్ కమెడియన్‌కు బంపరాఫర్..
బిగ్‌బాస్ హౌస్‌లోకి హైపర్ ఆది ? (File Photos)
  • Share this:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. వచ్చే నెల నుంచి షూటింగ్స్‌ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే  మార్గదర్శకాలు విడుదల చేసింది. అదే టైమ్‌లో స్టార్ మా వాళ్లు బిగ్‌బాస్ 4 కు సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేరేషన్ మొదులపెట్టారు. అన్ని కుదిరితే.. నవంబర్ చివర్లో ఈ రియాల్టీ షో ప్రారంభం కానుంది. అప్పటికే ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ.. కరోనా వైరస్ లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ షోను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  ‌ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే నలుగురు కంటెస్టెంట్స్‌ను ఇప్పటికే స్టార్ మా ఫైనలైజ్ చేసారని తెలుస్తుంది. అందులో ఒకరు ఒకప్పటి లవర్ బాయ్ హీరో తరుణ్‌ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈయన పేరు మూడో సీజన్‌కు కూడా వినిపించింది. కానీ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తుంది. ఇక సింగర్ కమ్‌ యాంకర్ మంగ్లీ.. మరో హాట్ యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్‌.. సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్‌ ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ రియాల్టీ షో వాళ్లు ఈ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందకు హైపర్ ఆది సంప్రదించింది. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హైపర్ ఆది.. ఈ రియాల్టీ షోలో భాగం అయ్యేందకు ఓకే చెప్పాడనే వార్త చక్కర్లు కొడుతుంది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్ 4లో పార్టిసిపేట చేసేందుకు భారీ మొత్తంలో హైపర్ ఆదికి ముట్టజెప్పినట్టు సమచాారం. బిగ్‌బాస్ విషయమైన హైపర్ ఆదికి మల్లెమాల వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఐతే.. స్టార్ మా యాజామాన్యం చెబుతున్న ప్రకారం బిగ్‌బాస్ సీజన్ 4ను ఎన్టీఆర్ హోస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 24, 2020, 7:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading