Home /News /movies /

JABARDASTH SHOCKING COMMENTS ON ANCHOR RASHMI AND SUDIGALI SUDHEER IN TELUGU COMEDY SHOW NR

Jabardasth: సుడిగాలి సుధీర్‌కు పట్టిన దరిద్రం రష్మీ.. జబర్దస్త్ నరేష్ షాకింగ్ కామెంట్స్!

sudigali sudheer

sudigali sudheer

Jabardasth: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఓరేంజ్ లో దూసుకుపోతుంది. ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు వాళ్లు చేసే కామెడీ పంచ్ లు

    Jabardasth: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఓరేంజ్ లో దూసుకుపోతుంది. ఇక ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌లు వాళ్లు చేసే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఇందులో యాంకరింగ్ చేసే అనసూయ, రష్మీల అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


    ఇక రష్మి, సుడిగాలి సుధీర్ ల జంట గురించి ఆ షోలోనే కాకుండా బయట కూడా తెగ మాట్లాడేసుకుంటారు. వీరిద్దరూ నిజంగా ప్రేమ లో ఉన్నారా అన్నట్లుగా ఆ ప్రోగ్రాం లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ జంట ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ షో లో కూడా అదే విధంగా ఉంటారు. ఇక వీరిద్దరూ కలిసి డాన్స్ చేయడం, స్కిట్స్ చేయడం అంతేకాకుండా రొమాంటిక్ గా కాస్త మించిపోవడం చేస్తుంటారు. కానీ ఇదంతా రేటింగ్ కోసం మాత్రమే చేస్తామని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. కానీ ఇదిలా ఉంటే తాజాగా సుడిగాలి సుధీర్ కి రష్మీ ఓ దరిద్రంలా పట్టిందట..


    తాజాగా ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో బుల్లెట్ భాస్కర్ ఓ స్కిట్ చేశాడు. ఇక అందులో సుధీర్ ను హీరో గా చూపించే ప్రయత్నం చేయగా.. సుధీర్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని చూస్తున్నాయట. కానీ సుధీర్ మాత్రం ఇక్కడే ఉండి పోయాడని దానికి కారణం ఆయనకు పట్టిన దరిద్రం రష్మీ అని తెలిపాడు. సుధీర్ కి పట్టిన దరిద్రం మీరే మేడం.. మీరే వెంటపడి రోజు టార్చర్ పెడుతున్నారు.. దయచేసి నీ కాళ్లు పట్టుకుంటానమ్మా.. ఆయనే వదిలేయమ్మ.. ప్లీజమ్మా రష్మిక మందన తో వెయ్యాల్సిన వాడమ్మా అంటూ ప్రాధేయపడ్డాడు. ఇక వెంటనే రష్మి మరొక డైలాగుతో కౌంటర్ వేసింది.

    Published by:Navya Reddy
    First published:

    Tags: Anchor rashmi, Jabardasth, Jabardasth naresh, Sudigali sudheer, Telugu comedy show

    తదుపరి వార్తలు