‘జబర్దస్థ్’లో నాగబాబును మరిపించలేకపోతున్న శేఖర్,జానీ మాస్టర్.. ఇంతకీ మెగా బ్రదర్ రీ ఎంట్రీ ఎపుడు..

జబర్ధస్త్ కామెడీ షో ఇపుడు రాజకీయాలకు వేదిక అయింది.  మొన్నటి వరకు  ఈ షోలో జడ్జీలుగా వ్యవహరించి నాగబాబు, రోజాలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంతో వారి ప్లేస్‌లో మీనా,శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్‌లు జడ్జి ప్లేస్‌లో వచ్చారు.ఇక జబర్ధస్త్ జడ్జెస్‌గా వ్యవహరిస్తోన్న మీనా, శేఖర్ మాస్టర్‌. జానీ మాస్టర్‌లపై  ఆడియన్స్‌లో అనుకున్నంత రేంజ్‌లో క్రేజ్ రాలేదు. దీంతో నాగబాబు ఎంట్రీ ఎపుడా అని ఆడియన్స్ వెయిటింగ్ చేస్తున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 25, 2019, 6:37 PM IST
‘జబర్దస్థ్’లో నాగబాబును మరిపించలేకపోతున్న శేఖర్,జానీ మాస్టర్.. ఇంతకీ మెగా బ్రదర్ రీ ఎంట్రీ ఎపుడు..
నాగబాబు,శేఖర్ మాస్టర్,జానీ మాస్టర్
  • Share this:
జబర్ధస్త్ కామెడీ షో ఇపుడు రాజకీయాలకు వేదిక అయింది.  మొన్నటి వరకు  ఈ షోలో జడ్జీలుగా వ్యవహరించి నాగబాబు, రోజాలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంతో వారి ప్లేస్‌లో మీనా,శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్‌లు జడ్జి ప్లేస్‌లో వచ్చారు.ఇక జబర్దస్త్ కామెడీ షో అనగానే ముందుకు గుర్తొచ్చేది ‘జబర్దస్త్’ జడ్జీలు రోజా, నాగబాబులే. స్క్రిట్స్‌లో చేసే కామెడీ చూసి నవ్వేవారి కంటే రోజా, నాగబాబుల రియాక్షన్ చూసి నవ్వుకుంటుంటారు చాలామంది. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యారు రోజా, నాగబాబు. జబర్దస్త్ టీవీ షో వివాదాల్లో ఇరుక్కున్నప్పుడు కూడా వీరు ఈ ప్రోగ్రామ్‌కు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఇక ఈ ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరించిన రోజా నగరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అంతేకాదు గెలుపుపై ధీమా ఉంది. ఒకవేళ వైయస్ఆర్సీపీ అధికారంలో వస్తే మంత్రి పదవి ఖాయం అనే పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు నాగబాబు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన నుంచి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఈయన కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. అంతేకాదు ఎన్నకల్లో ఎంపీగా గెలిచినా.. జబర్ధస్త్ ప్రోగ్రాంను విడిచిపెట్టనని చెప్పాడు.

https://images.news18.com/telugu/uploads/2019/04/meena-sekhar-.jpg
జబర్దస్త్ జడ్జులు


ఇక జబర్ధస్త్ జడ్జెస్‌గా వ్యవహరిస్తోన్న మీనా, శేఖర్ మాస్టర్‌. జానీ మాస్టర్‌లపై  ఆడియన్స్‌లో అనుకున్నంత రేంజ్‌లో క్రేజ్ రాలేదు. రోజా, నాగబాబు మాదిరి వీళ్లు జడ్జెస్‌గా మెరుపులు మెరిపించలేకపోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో  వినిపిస్తోంది. ఇక ఇపుడిపుడే మీనా కూడా తనదైన స్టైల్‌లో పంచ్‌లు వేస్తూ ప్రోగ్రాంకు రక్తి కట్టించే పనిలో పడింది. వారంలో గురు, శుక్రవారాలు ప్రసారమవుతున్న ఈ షోకు గురువారం  జానీ మాస్టర్, శుక్రవారం శేఖర్ మాస్టర్ జడ్జెస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. వారికున్న సినిమా కమిట్‌మెంట్స్ కారణంగా  వారంలో ఒక రోజు జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.ఇక మీనా మాత్రం రెండు ఎపిసోడ్స్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. జడ్డెస్‌గా వీరు నాగబాబు..స్పాంటినియస్‌గా స్పందించడం లేదనే టాక్ వినబడుతోంది. మొత్తానికి జబర్ధస్త్ షోకు నాగబాబు లేని లోటు ఉప్పు లేని పప్పుల..మసాలా లేని కూర లాగా తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జబర్ధస్త్‌ ప్రోగ్రాం చూసే ప్రేక్షకులు నాగబాబు ఎపుడు ఎంట్రీ  ఇస్తాడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
First published: April 25, 2019, 6:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading