జబర్దస్త్ సాయి తేజ అమ్మాయిగా మారడానికి ఎంత ఖర్చు అయిందంటే..

Jabardasth Sai Teja: జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు స్టార్స్ అయ్యారు. అయితే అందులో నవ్వించిన దానికంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం సాయి తేజ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 10, 2020, 8:39 PM IST
జబర్దస్త్ సాయి తేజ అమ్మాయిగా మారడానికి ఎంత ఖర్చు అయిందంటే..
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (jabardasth sai teja/Twitter)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు స్టార్స్ అయ్యారు. అయితే అందులో నవ్వించిన దానికంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది మాత్రం సాయి తేజ ఉరఫ్ ప్రియాంక సింగ్. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి సంచలనం సృష్టించాడు ఈ కమెడియన్. స్క్రీన్‌పై కామెడీ చేసే తన జీవితంలో చాలా విషాదాలు ఉన్నాయంటున్నాడు ఈయన.. సారీ సారీ ఈమె. సాయితేజగా అందరికీ తెలిసినా కూడా తను మాత్రం చిన్నప్పటి నుంచి అమ్మాయిగా ఉండటానికే ఇష్టపడ్డానని చెప్పింది ప్రియాంక. తనకు ఐదేళ్లు ఉన్నప్పటి నుంచే అక్క బట్టలు వేసుకోవడం.. ఆ తర్వాత చీరలు కట్టుకోవడం లాంటివి ఎవరికీ తెలియకుండా చేసానని చెబుతుంది ఈమె.

జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (jabardasth sai teja/Twitter)
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (jabardasth sai teja/Twitter)


ఇక చూసి చూసి చివరికి ఓ వయసు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నానని.. అమ్మాయిగా మారిపోయానని చెప్పింది ఈమె. అయితే అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అమ్మానాన్నలకు కూడా చెప్పలేదని.. అది వాళ్లకు నచ్చలేదని తెలిపింది ప్రియాంక. సర్జరీ చేయించుకుంటానని చెప్పినపుడు తన స్నేహితులే అండగా నిలిచారని.. అది జరిగిన తర్వాత 9 నెలలు నరకం చూసానని చెప్పింది ఈమె. సాయితేజ కాస్తా ప్రియాంకగా పేరు మార్చుకున్న తర్వాత కూడా కెరీర్ స్లోగానే ఉంది.

జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)


ప్రస్తుతం అదిరింది షోలో నటిస్తుంది ఈమె. అయితే ఇలా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి మాత్రం చాలానే ఖర్చు అయిందని తెలిపింది ప్రియాంక. సర్జరీ ఎక్కడ చేయించుకున్నావ్.. ఎంత ఖర్చు అయింది.. ఎవరెవరు వచ్చారు అలాంటి ప్రశ్నలు మాత్రం అడగొద్దని నేరుగానే యాంకర్‌కు షాక్ ఇచ్చింది పింకీ. ఆ వివరాలన్నీ తన పర్సనల్ అని.. కానీ భారీగానే ఖర్చు అయిందని మాత్రం చెప్పింది. ఆ ఖర్చు లక్షల్లోనే ఉంటుందని కూడా చెప్పింది.

జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (jabardasth sai teja/Twitter)
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (jabardasth sai teja/Twitter)


ఎవరూ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. అంతా తను సంపాదించిందే అని చెబుతుంది ఈమె. ఈ టైమ్‌లో కాకపోతే తర్వాత మారినా కూడా లాభం లేదని తెలిసిన తర్వాతే అమ్మాయిగా మారిపోయానని చెప్పింది ప్రియాంక. సినిమాల కోసం.. అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్ చేయడానికి తనకేం అభ్యంతరాలు లేవని చెప్పాడు సాయి తేజ ఉరఫ్ ప్రియాంక సింగ్.
First published: April 10, 2020, 8:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading