• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JABARDASTH ROJA NAMES ME AS SMALL SCREEN KAMAL HAASAN SAYS GETUP SRINU SK

రోజాపై గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..

రోజాపై గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..

గెటప్ శ్రీను

సమాజంలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ కలిగిన వ్యక్తులు చాలా మందే కనిపిస్తారని.. అలాంటి వారిని చూసే కొత్త కొత్త గెటప్స్ వేస్తున్నానని శ్రీను వ్యాఖ్యానించారు.

  • Share this:
    గెటప్ శ్రీను..! బుల్లితెర కమల్ హాసన్‌గా చాలా ఫేమస్..! చిత్రవిచిత్ర గెటప్స్, ఫన్నీ వాయిస్‌తో జబర్దస్త్‌లో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఆయన గెటప్ చూస్తేనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. ప్రతి వారం ఓ కొత్త గెటప్‌తో బుల్లితెరపై సందడి చేసే గెటప్ శ్రీనును.. బుల్లితర కమల్ హాసన్‌గా అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. శ్రీను యాక్టింగ్ స్కిల్స్‌పై రోజా, నాగబాబు ఎన్నోసార్లు ప్రశంసలు కురిపించారు. శ్రీను లాంటి నటుడు ఇండస్ట్రీకి ఎంతో అవసరమని.. త్రీ మంకీస్ టీజర్ లాంచ్ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యానించారు. ఐతే 'బుల్లితెర కమల్ హాసన్' పేరు వెనక కహానిని ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు శ్రీను.

    బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు తనకు కొంచెం బరువుగానే ఉంటుందని శ్రీను చెప్పారు. నటుడిగా తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని..ప్రస్తుతానికి ఆ పేరుకు అర్హత, అనుభవం తనకు లేదని వెల్లడించారు. తనను బుల్లితెర కమల్ హాసన్ అంటూ మొదట రోజా అన్నారని.. ఆ తర్వాత ఆడియెన్స్‌లోకి ఆ పేరు వెళ్లిపోయందని చెప్పారు. గెటప్ శ్రీను పేరు కూడా జనాల నుంచి వచ్చిందన్న ఆయన.. ఇప్పటి వరకు 90 గెటప్స్ వేశానని తెలిపారు. జబర్దస్త్‌లోకి వచ్చాకే నటన విషయంలో తనను తాను సానబెట్టుకుంటున్నానని.. ఇక్కడ రోజూ నేర్చుకుంటున్నానని వెల్లడించారు.

    సమాజంలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, వాయిస్ కలిగిన వ్యక్తులు చాలా మందే కనిపిస్తారని.. అలాంటి వారిని చూసే కొత్త కొత్త గెటప్స్ వేస్తున్నానని శ్రీను వ్యాఖ్యానించారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానినని తెలిపారు గెటప్ శ్రీను. తెలుగులో వచ్చే అన్ని సినిమాలు చూస్తానని.. కానీ చిరంజీవి సినిమా మాత్రం మొదటి రోజే చూస్తానని చెప్పారు.
    First published: