Jabardasth Rohini: బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత పరిచయాన్ని పెంచుకుంది. ఈ షో తర్వాత పలు షోలలో కూడా అవకాశాలు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన పాత్రలతో బాగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం రోహిణి ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా చేస్తుంది. ఇక ఈ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ షో కి సంబంధించిన ఎపిసోడ్ విడుదల కాగా అందులో కొన్ని పర్ఫామెన్స్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటున్నాయి. ఈ షోలో సుడిగాలి సుధీర్ యాంకర్ గా చేస్తూ బాగా ఆకట్టుకుంటున్నాడు.
ఇది కూడా చదవండి:స్కూల్లోనే బోలెడు ముద్దులు పెట్టుకున్నాం.. ఇవి కూడా ముద్దులేనా: రోహిణి
ఇందులో వెండితెర, బుల్లితెర సెలబ్రెటీలు పాల్గొని తెగ సందడి చేశారు. ఇక పలువురు సింగర్స్, డాన్సర్ తమ పర్ఫామెన్స్ లతో బాగా మెప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా రోహిణి కూడా తన పెర్ఫార్మెన్స్ తో బాగా సందడి చేసింది. అలనాటి తార విజయశాంతి నటించిన సినిమాలలో కొన్ని సినిమాలను ఎంపిక చేసుకొని అందులోని పాటలను, కొని డైలాగులను చేసి చూపించింది.
అచ్చం బుల్లితెర వేదికపై విజయశాంతి వచ్చి నటించినట్లే చేసింది రోహిణి. గ్యాంగ్ లీడర్, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, ఒసేయ్ రాములమ్మ, ప్రతిఘటన, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో విజయశాంతి చేసిన కొన్ని సన్నివేశాలు, పాటలను తీసుకొని ఆ పాత్రలకు తగ్గట్టుగా వస్త్ర ధారణ చేసి బాగా పర్ఫామెన్స్ చేసింది. ఇక రోహిణి నటనను చూసి అక్కడున్న వారంతా విజయశాంతి పాత్రలను గుర్తుకు చేసుకున్నారు. అంతేకాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించింది. మరికొందరు సినిమాలకు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అయితే టీవీకి లేడీ సూపర్ స్టార్ రోహిణి అంటూ తెగ పొగిడారు. ప్రస్తుతం ఆమె చేసిన పర్ఫామెన్స్ లు బాగా వైరల్ గా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indraja, Jabardasth, Jabardasth rohini, Sridevi drama company, Sudigali sudheer, Vijayashanthi