Home /News /movies /

JABARDASTH RASHMI GUATAM REACTED TO HER FAN POST ON HIS PIC AK

నీ పిక్ వాల్‌పేపర్ పెట్టాను... ఫ్యాన్‌కు జబర్ధస్త్ రష్మీ షాక్

రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్

సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే అభిమానికి ఊహించని షాక్ ఇచ్చింది జబర్ధస్ యాంకర్ రష్మీ.

    తన అందచందాలు, ఒంపుసొంపులతో కుర్రకారు మనసు దోచుకున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ... యాంకర్‌గా రష్మీ ఇమేజ్ ఇప్పటికీ పీక్స్‌లోనే ఉందని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. క్యూట్ అండ్ హాట్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు అందాల విందు అందించే రష్మీ లుక్స్‌కు ఫిదా అయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా తన ఫోటోలను ఎంతగానో లైక్ చేసే అభిమాని ట్వీట్‌కు రియాక్టయ్యింది ఈ ముద్దుగుమ్మ.



    సోషల్ మీడియాలో రష్మీని ఎంతగానో ఫాలో అయ్యే ఓ అభిమాని... రీసెంట్‌గా ఆమె ఫోటోలను తన సెల్‌ఫోన్‌లో వాల్ పేపర్‌గా పెట్టుకున్నాడు. అలా తన సెల్‌ఫోన్‌లో ఉన్న రష్మీ ఫోటోలతో ఫోన్‌కు అందం వచ్చిందంటూ అభిమాని ట్వీట్ చేశాడు. సాధారణంగా వేల సంఖ్యలో వచ్చే ఇలాంటి ట్వీట్స్‌కు రియాక్ట్ కాని రష్మీ... ఆ అభిమాని పోస్ట్‌కు మాత్రం ఫిదా అయిపోయింది. పోస్టు బాగుందని ట్వీట్ చేసింది. దీంతో ఆ అభిమాని ఫుల్ ఖుషీ అయిపోయాడు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jabardasth, Jabardasth comedy show, Rashmi Gautam, Tollywood, Tollywood news

    తదుపరి వార్తలు