ఉల్లి ధర తగ్గించడానికి రష్మీ గౌతమ్ జబర్దస్త్ చిట్కా

ఇప్పటికే మన సోషల్ మీడియాలో కూడా ఉల్లి ధరలు పెరిగాయని చెప్పి తెగబాధ పడిపోకుండా ధరలు తగ్గించడానికి ఒక చిన్న చిట్కా సింపుల్ ఉందంటూ... ఓ మేసేజ్ చక్కర్లు కొడుతుంది.

news18-telugu
Updated: December 8, 2019, 10:01 AM IST
ఉల్లి ధర తగ్గించడానికి రష్మీ గౌతమ్ జబర్దస్త్ చిట్కా
రష్మీ గౌతమ్
  • Share this:
ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. ఏపీలో కిలో ఉల్లి  వందకు దగ్గర్లో ఉంటే... తెలంగాణలో కిలో ఉల్లి రూ. 80 వరకు ఉంది. దేశ రాజధానిలో అయితే కేజీ ఉల్లి ధర రూ. 165కు చేరింది.  అయితే తాజాగా ఉల్లి ధరలపై సోషల్ మీడియాలో అనేక జోకులు పేలుతున్నాయి. అయితే తాజాగా జబర్దస్త్ బ్యూటీ రష్మీ ఉల్లి ధరలపై స్పందించింది. నో ఆనియన్ మంత్ అంటూ ఓ మెసేజ్‌ ట్వీట్ చేసింది. ‘జపాన్‌లో ఓ సాంప్రదాయం ఉంటుంది. అక్కడ ఏదైనా వస్తువు ధర అమాంతం పెరిగితే. దాన్ని కొన్నిరోజుల పాటు వాడకుండా ఉంటారు’ అంటూ ట్వీట్ చేసింది రష్మీ.

ఇప్పటికే మన సోషల్ మీడియాలో కూడా ఉల్లి ధరలు పెరిగాయని చెప్పి తెగబాధ పడిపోకుండా ధరలు తగ్గించడానికి ఒక చిన్న చిట్కా సింపుల్  ఉందంటూ... ఓ మేసేజ్ చక్కర్లు కొడుతుంది. అదికూడా దాదాపు రష్మీ చెప్పిన ట్వీట్‌ లాగానే ఉంది. వారం రోజులపాటు ఉల్లిపాయలు మర్చిపోండి ఎవరు కొనవద్దు అసలు ఉల్లిపాయలు అనే ఒక పదార్థం ఉంది అన్న విషయం మర్చిపోండి. దెబ్బకి ఎక్కడెక్కడో దాచిపెట్టిన ఉల్లిపాయలు అన్ని బయటకు వస్తాయి అవసరమైతే ఫ్రీగా కూడా ఇస్తారు మళ్లీ తిరిగి అలవాటు చేయడం కోసం నేనైతే ఉల్లిపాయలు వాడటం మా ఇంట్లో పూర్తిగా మానేశాను ఒక రెండు రోజులు ఉల్లిపాయలు తినకపోతే మనము ఏమి పైకి పోము కదా. ఈ ఉల్లిపాయల బ్లాక్ మార్కెట్ గాడికి మనము ఇవ్వగలిగిన గిఫ్ట్ ఇదే దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేయగలరు. అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>