Jabardasth Rashmi Gautam : జబర్దస్త్ కామెడీ షో రాక ముందు రష్మీ గౌతమ్ అంటే ఎవరికీ తెలియదు. కానీ... ఆ షో ఆమె జీవితాన్నే మార్చేసింది. బుల్లితెరపై నవ్వుల పువ్వులు పూయిస్తూ... డైనమిక్ మాటలతో రష్మీ చేస్తున్న యాంకరింగ్... యూత్‌ని కట్టిపడేస్తోంది. ఫలితంగా ఇప్పుడామె ఓ స్టార్ యాంకర్. స్క్రీన్‌పై ఆమె కనిపిస్తే చాలు... ఆ షో రేటింగ్స్ దుమ్ము రేపుతున్నాయి. జనరల్‌గా చాలా మంది ముందుగా టీవీ సీరియళ్లు, ఇతర ప్రోగ్రామ్స్‌లో పరిచయమై... తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడతారు. కానీ... రష్మీ... ముందుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి... అక్కడ సక్సెస్ రాకపోవడంతో... పూర్తిగా తెరమరుగైంది. చాలా కాలం గ్యాప్ తీసుకొని... జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ షో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో... ఇక రష్మీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోయింది.
ప్రస్తుతం రష్మీ... జబర్దస్త్ కామెడీ షోతో పాటూ... మరిన్ని కామెడీ, అడ్వెంచర్ షోలు, ఫొటోషూట్లూ చేస్తూ బిజీ అయిపోయింది. రెండు చేతులా సంపాదిస్తూ... కెరీర్‌ను ఫుల్ స్పీడ్‌గా రన్ చేస్తోంది. ఐతే... ఇంత టాలెంట్ ఉండీ... ఆమె టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం సక్సెస్ కాలేకపోతోంది. సినిమాల్లో ఆమెకు ఇస్తున్న కేరక్టర్లన్నీ అందాల ఆరబోతకే పరిమితం అవుతున్నాయి. ఆమెలో టాలెంట్ నిరూపించుకునే కేరక్టర్ ఇప్పటివరకూ రష్మీకి దక్కలేదు. 30 ప్లస్ ఏజ్‌లో కూడా రష్మీ... హాట్‌గా ఉన్నందువల్లే... ఆమెకు అలాంటి కేరక్టర్లు ఇచ్చేందుకు సినీ ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు.
సినిమా సక్సెస్ అవ్వాలంటే... బ్యూటీ ఒక్కటే సరిపోదు కదా... అందుకే రష్మీకి... సిల్వర్ స్క్రీన్ సెట్ కావట్లేదు. ఐతేనేం... అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తూ... రెగ్యులర్‌గా బుల్లితెరపై దర్శనమిస్తూ... అమ్మడు సరైన ట్రాక్‌లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
View this post on Instagram
ఆ హీరోయిన్లకు షాక్ : ఇటీవల చాలా మంది హీరోయిన్లు... రష్మీలా బుల్లితెరపై కాకుండా... డైరెక్టుగా వెండితెరపైనే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నారు. ఒకట్రెండు సినిమాలకే ఫేడవుట్ అవుతున్నారు. అలాంటి వాళ్లు టీవీ తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపట్లేదు. ఆల్రెడీ సినిమాల్లో చేయడంతో... టీవీల్లో ప్రోగ్రామ్స్ చెయ్యడానికి వాళ్లు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఫలితంగా అటు టాలీవుడ్‌లోనూ క్లిక్ అవ్వక, ఇటు టీవీ ప్రోగ్రామ్సూ చెయ్యలేక... వాళ్ల కెరీర్... అర్థాంతరంగా ముగిసిపోతోంది. అలాంటి వాళ్లంతా రష్మీని చూసి ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్‌లో క్లిక్ కాలేకపోతున్నా... టీవీ ప్రోగ్రామ్స్‌లో దుమ్మురేపుతున్న రష్మీ... లక్షల మంది అభిమానుల్ని తన చుట్టూ తిప్పుకుంటూ... అప్పుడప్పుడూ సినిమా ఆఫర్లు కూడా అందుకుంటూ... కెరీర్ ట్రాక్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది.
Pics : వామ్మో ఇలియానా హాట్ అందాలతో చంపేస్తోందిగా...
ఇవి కూడా చదవండి :
కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి... నేడు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దర్శనం
Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...
Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే
Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.