ఆ నిర్మాతను ఇష్టపడుతున్న జబర్దస్త్ రష్మీ

Edward Thomas Hardy CBE : జబర్దస్త్ రష్మీ గౌతమ్‌కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారని మనకు తెలుసు. జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లందరికీ ఆమె గురించి చాలా విషయాలు తెలుసు. ఐతే... ఆమెకు నచ్చిన నిర్మాత ఎవరో తెలుసా?

news18-telugu
Updated: November 5, 2019, 4:47 PM IST
ఆ నిర్మాతను ఇష్టపడుతున్న జబర్దస్త్ రష్మీ
రష్మీ గౌతమ్ (credit - insta - rashmigautam)
  • Share this:
Jabardasth Rashmi Gautam : టాలీవుడ్ నటి, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో యాంకర్ రష్మీ గౌతమ్‌కి సంబంధించిన కొత్త విషయమొకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే... ఆమెకు టాలీవుడ్‌లో ఎంతో మంది తెలిసినా... వాళ్లకంటే ఎక్కువగా... ఆమె హాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన ఎడ్వార్డ్ థామస్ హార్డీని ఇష్టపడుతోంది. ఈ 42 ఏళ్ల నటుడు 2001లో రిడ్లీ స్కాట్ ఫిల్మ్ బ్లాక్ హాక్ డౌన్‌తో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్టార్ ట్రెక్ నెమెసిస్ (2002), రాక్ ఎన్ రోల్లా (2008), బ్రాన్సన్ (2008), వారియర్ (2011), ది డ్రాప్ (2014), ది రెవెనాంట్ (2015), సినిమాలతోపాటూ... మాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్, ఇన్సెప్షన్, డార్క్ నైట్ రైజెస్, వెనమ్ వంటి సినిమాల్లోనూ దుమ్మురేపి... అశేష అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు హార్డీ ఏ ప్రాజెక్టును ఎంచుకున్నా... అది ఓ రేంజ్‌లోనే ఉంటుంది. అందుకే ఆయన ఫ్యాన్స్ లిస్టులో రష్మీ గౌతమ్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, రణవీర్ సింగ్, ప్రియాంకా చోప్రా కూడా ఉన్నారు.
 View this post on Instagram

 

A post shared by Tom Hardy (@tomhardy) on

థామస్ హార్డీకి రష్మీ ఫ్యాన్ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది. రష్మీ లాగే హార్డీ కూడా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అతను స్వయంగా చారిటీ వర్క్ చేస్తున్నాడు. అంతేకాదు... 2018లో అతను బ్రిటన్ ప్రభుత్వం నుంచీ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ అవార్డ్ గెలుచుకున్నాడు. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉండటం వల్లే... ఆమె... థామస్ హార్డీకి ఫ్యాన్ అయిపోయింది.

జబర్దస్త్ కామెడీ షోలో నవ్వులు పూస్తూ... ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న రష్మీకి... ఫ్యాంటసీ, యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాల్ని ఆమె బాగా ఇష్టపడుతుంది. ఆ క్రమంలో... థామస్ హార్డీ నటన, రిస్కీ షాట్లలో అతను చూపించే యాక్షన్ ఆమెకు బాగా నచ్చాయి. దాంతో... ఆమె అతని ఫ్యాన్ అయిపోయింది. ఐతే... ఈ విషయాన్ని రష్మీ ఎప్పుడూ, ఎక్కడా, ఎవరితోనూ చెప్పదు. ఎందుకంటే... ఆమె తన పర్సనల్ విషయాల్ని ఇతరులతో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడదు. ఇదివరకు ఓ అభిమాని ఆమె లావు అయిపోతోందని ఆవేదన వ్యక్తం చెయ్యడంతో... తనకు రుమాటిజం అనే అనారోగ్య సమస్య ఉందనీ... అందువల్లే తను అప్పుడప్పుడూ లావైపోతుంటానని తన పర్సనల్ విషయాన్ని బయటపెట్టింది. ఆ తర్వాతెప్పుడూ ఆమె పెద్దగా ఇలాంటి విషయాల్ని చెప్పలేదు. 
View this post on Instagram
 

Right. Taking this dog here for a walk 🌈🇬🇧🦅♠️💨🌅🌠🌠🌠🌠😇😇😇😇😇


A post shared by Tom Hardy (@tomhardy) on

జబర్దస్త్ కామెడీ షోతోపాటూ... ఇతర షోల్లో రష్మీ... సుడిగాలి సుధీర్ కాంబినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సుడిగాలి సుధీర్ కూడా ఆమెను ఎక్కువగా టీజ్ చేస్తూ... నవ్విస్తుంటాడు. ఐతే... తనపై వేసే సెటైర్లకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేసే రష్మీ... లోపలి వ్యక్తి మాత్రం డిఫరెంట్. ఆమె ఆలోచనలు టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. చాలా మంది హీరోయిన్ల లాగా ఆమె బాలీవుడ్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపకపోయినా... ఇష్టాయిష్టాల విషయంలో మాత్రం ఆమె ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఆలోచనలు కలిగివుంది. టాలీవుడ్‌లో వచ్చే రెగ్యులర్ సెంటిమెంటల్ సినిమాలు, గ్లామర్ డోస్‌ల కంటే... హాలీవుడ్‌లో కనిపించే... టెక్నికల్, సైన్స్ ఫిక్షన్‌కే ఆమె ఓటు వేస్తోంది.

 

Pics : కేరళ అందాలన్నీ తనలో దాచుకున్న బ్యూటీ దేవికా సంజయ్ఇవి కూడా చదవండి :

ఈసారి అక్కడే కోహ్లీ బర్త్‌డే వేడుకలు... అనుష్కతో కలిసి...

మొదట్లో నన్నూ తొక్కేశారు... మలైకా అరోరా సంచలన వ్యాఖ్యలు


HBD Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఫొటోలు... బర్త్‌డే స్పెషల్


వారానికి 3 రోజులు సెలవులు... ఉద్యోగులకు గుడ్ న్యూస్

HBD Kohli : హ్యాపీ బర్త్‌డే కోహ్లీ... రికార్డుల రారాజుకి విషెస్
Published by: Krishna Kumar N
First published: November 5, 2019, 2:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading