కోడి పందేలను చూసేందుకు జబర్దస్త్ నటులు రావడంతో.. వారిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Last Updated:
Share this:
సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని పల్లెల్లో ఎటు చూసిన పందెం కోళ్ల సందడే కనబడుతోంది. వ్యవసాయ క్షేత్రాల్లోని పందెం బరుల జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం సంక్రాంతి కోళ్ల పందేలను చూసేందుకు క్యూ కట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన కోళ్ల పందేలకు జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, రైజింగ్ రాజు, దొరబాబు హాజరై వీక్షించారు. రైజింగ్ రాజు తన కోడి పుంజుతో పందెంలో పాల్గొన్నారు.
'కోడి పందేలు మన సంప్రదాయం. దాన్ని మనం సపోర్ట్ చేయాలని. కోళ్ల పందేలు చూడాలన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది. ఈ సంక్రాంతికి అందరికీ శుభం కలగాలి.' రాంప్రసాద్ అన్నారు. తాను గోదావరి ప్రాంతానికి వాడినేనని.. ఐతే షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే కొన్నాళ్లుగా కోళ్లపందేలను చూడలేకపోతున్నానని దొరబాబు అన్నారు. ఇన్నాళ్లకు మళ్లీ పందేలను చూసి ఎంజాయ్ చేశామని చెప్పారు. పందేలను చూసేందుకు జబర్దస్త్ నటులు రావడంతో.. వారిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.