Home /News /movies /

JABARDASTH RAKESH NOMINATES THAGUBOTHU RAMESH DHANRAJ FOR GREEN INDIA CHALLENGE SR

Jabardasth: తాగుబోతు రమేష్, ధనరాజ్‌కు రాకింగ్ రాకేష్ ఛాలెంజ్..

తాగుబోతు రమేష్, ధనరాజ్‌కు రాకింగ్ రాకేష్ ఛాలెంజ్...

తాగుబోతు రమేష్, ధనరాజ్‌కు రాకింగ్ రాకేష్ ఛాలెంజ్...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా కో ఫౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఖాజాగూడలో మొక్కలు నాటాడు.

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా కో ఫౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఖాజాగూడలో మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం నా జీవితంలో ఇలాంటి మంచి కార్యక్రమం ఎప్పుడు చూడలేదు. నా ఎదుగుదలతో పాటు ఈరోజు నేను నాటిన మొక్కలు కూడా పెరుగుతుంటాయి. దాన్ని చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. డబ్బులు మనకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నాటిన మొక్క అలాగే ఎదుగుతుంది. ఇంత వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నందుకు.. నాకు ఈ ఛాలెంజ్ విసినందుకు కృతజ్ఞతలు అంటూ తెలిపాడు. ఇంకా రాకేష్ మాట్లాడుతూ.. తెలంగాణ మొత్తం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాతావరణంలో వచ్చే మార్పులను కాలుష్య నియంత్రణను హరికట్టాలంటే మొక్కలు నాటడం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. మా జబర్దస్త్ టీం సభ్యులైన నేహంత్, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, అవినాష్, పొట్టి నరేష్‌లను మొక్కలు నాటాలని ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా పాల్గొన్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Jabardasth, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు