అయోధ్య తీర్పుపై... జబర్దస్త్ బ్యూటీ రష్మీ ట్వీట్

తాజాగా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న అయోధ్య కేసు తీర్పుపై కూడా ఈ జబర్దస్త్ బ్యూటీ స్పందించింది.

news18-telugu
Updated: November 9, 2019, 5:21 PM IST
అయోధ్య తీర్పుపై... జబర్దస్త్ బ్యూటీ రష్మీ ట్వీట్
Instagram.com/rashmigautam
  • Share this:
జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్... సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అనేక సామాజిక అంశాల పట్ల కూడా స్పందిస్తూ ఉంటుంది. దీంతో పాటు కొన్ని పండగ పబ్బాల సందర్భంగా మంచి మెసేజులు కూడా తన అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న అయోధ్య కేసు తీర్పుపై కూడా ఈ జబర్దస్త్ బ్యూటీ స్పందించింది. తన ట్విట్టర్‌లో జై శ్రీరామ్ అంటూ పోస్టు పెట్టింది. దీంతో రష్మీ ట్వీట్‌ను ఆమె అభిమానులు సైతం లైకులు కొడుతున్నారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అన్ని విషయల్ని షేర్ చేస్తూ వస్తుంటుంది రష్మీ. వాటితో పాటు.. పలు సామాజిక అంశాల పట్ల కూడా అప్పుడప్పుడు ట్వీట్లు పెడుతుంటుంది. తమిళనాడులో బోరుబావిలో రెండేళ్ల చిన్నారి పడిపోయినప్పుడు కూడా రష్మీ తనవంతుగా ట్వీట్ చేసింది. ఏదేమైనా తమ అభిమాన యాంకర్... ఈ విషయంలో మాత్రం టాప్ అంటూ... ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రష్మీ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.

అయితే రష్మీ ట్వీట్‌ను ప్రశ్నిస్తూ ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ఇలాంటి ట్వీట్స్ పెట్టే ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీల్ని మొత్తం చదవాలన్నాడు.మీ ఉద్దేశం ప్రకారం... అక్కడ ముస్లీంలు బాబ్రీ మసీదు కట్టి తప్పు చేశారా అంట ప్రవ్నించాడు. దీనికి రష్మీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. మీలాంటివాళ్లు అనవసరంగా ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేస్తారని మండిపడింది. దీపావళి సమయంలో క్రాకర్స్‌ను కాల్చొద్దని చెబితే... నాపై హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారని ఆరోపించింది. ఇప్పుడేమో ఆర్ఎస్ఎస్ అనుకూలవాదినని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బక్రీద సమయంలో కూడా జంతువుల్ని హింసంచకూడదని తాను ట్వీట్ చేసినట్లు పేర్కొంది. తాను ఏ ఒక్క మతాన్ని వ్యతిరేకించడం లేదని చెప్పుకొచ్చింది. మొత్తం మీద అయోధ్యపై రష్మీ స్పందన సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపుతోంది.


First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>