JABARDASTH POLITICS PLAYING ON COMEDIANS SUDIGALI SUDHEER HYPER AADHI SAYS MEGA BROTHER NAGABABU PK
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ల గురించి నాగబాబు సంచలనాలు నిజాలు..
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రోజా
తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క షో నుంచి ఇండస్ట్రీకి ఎంతమంది కమెడియన్లు వచ్చారనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదు..
తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క షో నుంచి ఇండస్ట్రీకి ఎంతమంది కమెడియన్లు వచ్చారనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదు. టాలీవుడ్లో కొందరు సీనియర్ కమెడియన్లు ఇప్పుడు పనిలేకుండా ఉన్నారంటే దానికి కారణం ఈ జబర్దస్త్ టీమే. వాళ్లు తమ టాలెంట్‌తో వచ్చిన అవకాశాలు వాడుకుంటున్నారు. అందులో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ అయితే మరీనూ.. వీళ్లకు అభిమానులు కూడా ఉన్నారంటే మనోళ్ల రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జబర్దస్త్ లోగో
ఇలాంటి టీం లీడర్స్ మీద ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో కుట్ర జరుగుతుందని సంచలన నిజాలు బయటపెట్టాడు నాగబాబు. ఈయన ఈ మధ్యే కామెడీ షో నుంచి బయటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఎందుకొచ్చానో అని క్లారిటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా విడుదల చేసిన వీడియోలో మరిన్ని నిజాలు కూడా బయటపెట్టాడు ఈయన. అందులో సుధీర్, ఆది గురించి మరీ ప్రత్యేకంగా ప్రస్థావించాడు నాగబాబు. తనతో పాటు ఆ షో నుంచి మరికొందరు కూడా బయటికి రావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు ఈయన.
నాగబాబు సుడిగాలి సుధీర్ హైపర్ ఆది
కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు ఇప్పటికే బయటకు వచ్చారని.. యాంకర్ రవి, అనసూయ కూడా తమకు సపోర్ట్ చేసినట్లు చెప్పాడు నాగబాబు. అనసూయ ఈటీవీతో పాటు జీ తెలుగులో కూడా పని చేస్తున్నట్లు చెప్పాడు ఈయన. తనతో పాటే హైపర్ ఆది, సుధీర్ కూడా రావాలని చూసినా కూడా వాళ్లను అగ్రిమెంట్స్ పేరుతో అక్కడే ఆపేసారని చెప్పాడు ఈయన. వాళ్లపై కూడా ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో కుట్ర జరుగుతుందని చెప్పాడు ఈయన. వాళ్లను తీసేయాలని చూసారని.. అయితే అప్పట్లో తానే ఆపానని చెప్పాడు నాగబాబు.
నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)
ఇదిలా ఉంటే ఛానెల్ మారి తనతో రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా రాజకీయాలు చేసి వాళ్లను అక్కడే ఉండేలా అగ్రిమెంట్ పేరుతో బంధించారని ఇన్ డైరెక్ట్ పంచులు వేసాడు నాగబాబు. ఇప్పుడు ఈయన మాటలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే నాగబాబు చెప్పిన కారణాల కంటే జబర్దస్త్ వదిలేస్తే తమకు భవిష్యత్తు సరిగ్గా ఉండదేమో అనే భయంతోనే సుధీర్, ఆది అక్కడే ఉండిపోయారని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు సుధీర్, ఆది పేర్లు మాత్రమే నాగబాబు చెప్పడంతో మరో కొత్త వివాదానికి జబర్దస్త్ కేంద్రంగా మారింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.