బుల్లితెరపై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ అని చెప్పాలి. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రష్మీ, సుధీర్ మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి వాళ్లు ప్రేమించుకుంటున్నారని వార్తలు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ జంట కూడా వాటిని లైట్ తీసుకుంటారు.
వాళ్ల కెమిస్ట్రీ చూసి నిజంగానే ప్రేమ ఉందని.. పెళ్ళి కూడా చేసుకుంటారని అనుకుంటారు అభిమానులు. కానీ ఇద్దరి లోకం వేరు.. ఎవరి దారి వాళ్లదే. వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి అంతా అలా అనుకుంటారు కానీ నిజానికి వాళ్ల మధ్య ఏం లేదంటున్నాడు తోటి కమెడియన్ చమ్మక్ చంద్ర. సుధీర్, రష్మీపై ఎలాంటి యాక్ట్ చేసినా కూడా వెంటనే అది వైరల్ అయిపోతుంది. ఆ జోడీకి ఉన్న ఇమేజ్ అలాంటిది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కానీ ఆ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పాడు చంద్ర. ఆ స్కిట్‌కు సంబంధించినదే కానీ పర్సనల్ లైఫ్‌లో ఎవరి అలవాట్లు వాళ్లవే అంటున్నాడు చంద్ర.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు వాళ్లు సమాధానం చెప్పడం కూడా మానేసారని చెప్పాడు ఈయన. ఒక్కసారి షూటింగ్ అయిపోయిందంటే సుడిగాలి సుధీర్ లోకం వేరు.. రష్మీ లోకం వేరని.. ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారని చెప్పాడు చమ్మక్ చంద్ర. కేవలం రేటింగ్స్ కోసం బుల్లితెరపై అలా కనిపిస్తారు కానీ సుధీర్‌ను కనీసం ఎప్పుడూ రష్మీ గౌతమ్ అలా చూడలేదని చెబుతున్నాడు ఈ కమెడియన్. ఇదే విషయంపై గతంలో గెటప్ శ్రీను కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇంట్లో సుడిగాలి సుధీర్‌కు సంబంధాలు కూడా చూస్తున్నారని.. త్వరలోనే పెళ్లైపోతుందని క్లారిటీ ఇచ్చాడు గెటప్ శ్రీను. మొత్తానికి మనోడు ఇచ్చిన క్లారిటీతో సుధీర్, రష్మీ మధ్య ఉన్న రిలేషన్‌పై చాలా మందికి క్లారిటీ వచ్చేసినట్లే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chammak Chandra, Sudigali sudheer, Telugu Cinema, Tollywood