JABARDASTH NEW LOVE STORY BETWEEN VARSHA AND IMMANUEL GETTING POSITIVE RESPONSE AK
Jabardasth: Varsha, Immanuel లవ్ స్టోరీ సూపర్ హిట్.. ఇదిగో సాక్ష్యం
ఇమ్మాన్యుయేల్, వర్ష (Image: youtube)
Jabardasth: జబర్ధస్త్‌లో కొన్ని ఎపిసోడ్ల నుంచి ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య లవ్ స్టోరీ ఉండేలా స్కిట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వీటికి రెస్పాన్స్ కూడా బాగా వస్తోంది.
జబర్ధస్త్‌లో వర్ష, ఇమ్మాన్యుయేల్లది కొత్త లవ్ స్టోరీ. వీరి మధ్య ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ క్రియేట్ చేసిన జబర్ధస్త్ మేకర్లు.. ఆ లవ్ స్టోరీ సక్సెస్ అవుతుందా లేదా అని మొదట సందేహించారు. అయితే కొంతకాలంగా వీరి లవ్ స్టోరీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటోందని అర్థమవుతోంది. కొన్ని ఎపిసోడ్ల నుంచి ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య లవ్ స్టోరీ ఉండేలా స్కిట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వీటికి రెస్పాన్స్ కూడా బాగా వస్తోంది. యూట్యూబ్‌లో వీరిద్దరూ కలిసి చేస్తున్న స్కిట్లకు వచ్చే వ్యూస్ మూడు నుంచి నాలుగు మిలియన్లు దాటిపోతుండటంతో.. ఈ ఇద్దరి లవ్ స్టోరీని ఆడియెన్స్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
జబర్ధస్త్‌లో రష్మీ, సుధీర్ లవ్ స్టోరీని చూసి విసిగిపోయిన వారికి ఈ కొత్త లవ్ స్టోరీ కొత్త ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోందనే వాదన కూడా ఉంది. ఇక తనదైన పంచ్‌లతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న ఇమ్మాన్యుయేల్.. ఇటు జబర్ధస్త్, అటు ఎక్స్ట్రా జబర్ధస్త్లోనూ కనిపిస్తున్నారు. రెండు ఎపిసోడ్లలోనూ రెండుకు మించిన స్కిట్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. వేరే టీమ్ లీడర్ల స్కిట్స్లోకి ఎంట్రీ ఇస్తూ.. వారిని మించిపోయేలా కామెడీ పండిస్తున్నాడు. అలా వర్షతో లవ్ స్టోరీ, ఇటు తనదైన కామెడీ పంచ్‌లతో రాణిస్తున్న ఇమ్మాన్యుయేల్ త్వరలోనే టీమ్ లీడర్ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.