Home /News /movies /

JABARDASTH NARESH ROLE IN CHIRANJEEVI BHOLA SHANKAR SLB

Bhola Shankar క్రేజీ అప్‌డేట్.. చిరుతో తెరపంచుకున్న జబర్దస్త్ కమెడియన్! ఎవరు రికమండ్ చేశారో తెలుసా?

Bhola Shankar

Bhola Shankar

Jabardasth Naresh: మెహర్ రమేశ్ (Mehar Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' (Bhola Shankar) సినిమాలో జబర్దస్త్ నరేష్ భాగం కాబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కన్ఫర్మ్ చేసారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). రీసెంట్‌గా ఆచార్య (Acharya) రూపంలో డిజాస్టర్ ఎదురైనా కూడా పర్ఫెక్ట్ లైనప్‌తో మంచి జోష్‌లో తన తదుపరి సినిమాల షూటింగ్స్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ (Mehar Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' (Bhola Shankar) సినిమాలో భాగమవుతున్నారు. ఆ మధ్య ఈ సినిమాకు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్.. తదుపరి షెడ్యూల్‌ షూటింగ్ జూన్ నెల 21వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది.

ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్ (Jabardasth Naresh) భాగమయ్యారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేశారు. చూసేందుకు చిన్న పిల్లోడిలా ఉన్నా అతను వేసి పంచ్ మాత్రం ఓ రేంజ్‌లో పేలుతుందో మనందరికీ తెలుసు. అలా తనదైన శైలిలో కామెడీ చేస్తూ బుల్లితెర ఆడియన్స్‌ మెప్పు పొందిన నరేష్ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో తెరపంచుకోబోతున్నారట.

వరంగల్ జిల్లాలో పుట్టిన పెరిగిన నరేష్.. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చిరంజీవిని ఒక్కసారైనా కలవాలనేది తన డ్రీమ్‌గా ఉండేదని, అయితే ఆయనే స్వయంగా తన 'భోళా శంకర్' సినిమాలో నా పేరును రికమెండ్ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని నరేష్ చెప్పారు. తనను పిలిపించి మరీ ఎంతో సరదాగా ఆయన మాట్లాడారని, ఇది తన లైఫ్ లోనే గొప్ప అనుభూతి అని నరేష్ చెప్పారు. రెండు రోజులు 'భోళా శంకర్' షూటింగ్‌లో పాల్గొన్నానని, దీంతోపాటు గోపీచంద్ హీరోగా వస్తున్న మరో మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటిస్తున్నానని నరేష్ తెలిపాడు.

క్రియేటివ్ కమర్సిల్స్ తో కలిసి ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ భోళా శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా (Tamannah) హీరోయిన్‌గా నటిస్తుండగా.. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ (Keerthi Suresh) కనిపించనుంది. ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
Published by:Sunil Boddula
First published:

Tags: Bhola Shankar, Chiranjeevi, Tollywood

తదుపరి వార్తలు