జబర్థస్త్ ఖతర్నాక్ షో జడ్జీగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబుకు గెటప్ శీను అంటే చాలా ఇష్టం.ఆయన కూడా పలు సందర్భాల్లో బెస్ట్ కమెడియన్ శ్రీను అని చెప్పారు. చాలా బాషలలో కమెడియన్స్ ను చూసాను కానీ శ్రీను తర్వాతే ఎవరైనా అని నాగబాబు గెటప్ శీనును పలుసార్లు పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే నాగబాబుకు శీను అంటే ఎందుకంత ఇఫ్టం... అంతలా మీ పెర్ఫార్మన్స్ నాగాబాబును ఇంప్రెస్స్ చేసింది అని గెటప్ శ్రీనును ఒక ఇంటర్వ్యూలో అడిగారు. దానికి శీను సమాధానం ఇస్తూ... సార్ ఆ మాట అనడానికి రీజన్ ఐతే లేకుండా ఉండదన్నాడు ఆయనకు కామెడీ మీద చాలా అనుభవం ఉంది అప్పుడు అప్పుడు మాకు చాలా మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.
తాను 8 ఏళ్ల నుంచి నాగబాబు చూస్తున్నారన్నారు. తాను ఎలా యాక్టింగ్ చేస్తానో నాగబాబు గారికి తెలుస అన్నాడు గెటప్ శ్రీను. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా ఎక్కువ నవ్విస్తానన్న శ్రీను...తాను గతంలో చేసిన పనికి నాగబాబు ఎంతగా బాధపడ్డారో చెప్పుకొచ్చాడు. ఓ సారి గోవా వెళ్ళినప్పుడు నాగబాబును స్విమ్మింగ్ పూల్ లో చాలా ఎక్కువగా నవ్వించేసానన్నాడు. దీంతో 2 నెలల పాటు నాగబాబు వాయిస్ కూడా పోయిందన్నారు. నాగబాబు డాడీ అని సుడిగాలి సుధీర్ ఒక్కడే పిలుస్తాడన్నాడు గెటప్ శ్రీను.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.