హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆదిపై చేయి చేసుకున్న రోజా...అంత మాట అనగానే..

హైపర్ ఆదిపై చేయి చేసుకున్న రోజా...అంత మాట అనగానే..

రోజా, హైపర్ ఆది (Roja Hyper Aadi)

రోజా, హైపర్ ఆది (Roja Hyper Aadi)

హైపర్ ఆది మధ్యలో కల్పించుకొని ఇద్దరికీ రెండు సంవత్సరాల తర్వాత షష్టి పూర్తి అవుతుందని ఆ తర్వాత తాను వస్తానని పంచ్ వేశాడు. దీంతో సీరియస్ అయిన రోజా పక్కనే ఉన్న హైపర్ ఆది వీపుపై దెబ్బ వేసింది.

  హైపర్ ఆది అంటే పంచులు వేయడంలో మహా ఎక్స్ పర్ట్ అనే చెప్పవచ్చు. కానీ ఒక్కోసారి ఆ పంచులు మిస్ ఫైర్ అవుతుంటాయి. దీంతో వివాదాలు ముసురుకొస్తుంటాయి. అయితే తాజాగా ఆడవారి పార్టీలు అర్థాలే వేరులే ప్రోగ్రాంలో హైపర్ ఆది వేసిన పంచులకు వీపు పగిలిపోయింది. వర్షిణితో కలిసి రోజా కొత్త సంవత్సరంలో తనకు కేవలం 20 సంవత్సరాలు వస్తాయని జోక్ చేస్తే...హైపర్ ఆది మధ్యలో కల్పించుకొని ఇద్దరికీ రెండు సంవత్సరాల తర్వాత షష్టి పూర్తి అవుతుందని ఆ తర్వాత తాను వస్తానని పంచ్ వేశాడు. దీంతో సీరియస్ అయిన రోజా పక్కనే ఉన్న హైపర్ ఆది వీపుపై దెబ్బ వేసింది. దీంతో హైపర్ ఆది ఖంగుతిన్నాడు. అంతే కాదు ఇదే షోలో హైపర్ ఆది రెచ్చిపోయి పంచులు వేశాడు. అందులో ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు కొత్త సంవత్సరంలో మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశ ఉందని పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చేశాడు.

  (Image: Youtube)

  అంతేకాదు షో కేవలం కిట్టీ పార్టీ లాంటిదని అదేమీ, పొలిటికల్ పార్టీ కాదని చెప్పేశాడు. ఇలా హైపర్ ఆది కొత్త సంవత్సరం స్పెషల్ ప్రోగ్రామ్ లో రెచ్చిపోయాడు. అలాగే నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో, రోజానే ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో తానే రాజు తానే మంత్రి అంటూ మరో పంచ్ వేశాడు. ఇలా హైపర్ ఆది తన పంచులతో కొత్త సంవత్సరం ప్రస్థానం మొదలెట్టాశాడు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Hyper Aadi, Hyper Adi, Jabardasth, MLA Roja, Rk roja

  ఉత్తమ కథలు