హోమ్ /వార్తలు /సినిమా /

Jabardasth: ఇండస్ట్రీలో మరో విషాదం.. జబర్దస్త్ నటుడు మృతి..!

Jabardasth: ఇండస్ట్రీలో మరో విషాదం.. జబర్దస్త్ నటుడు మృతి..!

జబర్దస్త్ లో విషాదం.. మిమిక్రీ మూర్తి మృతి

జబర్దస్త్ లో విషాదం.. మిమిక్రీ మూర్తి మృతి

ఇవాళ మధ్యాహ్నం ఆయన చనిపోయినట్లు సోదరుడు అరుణ్ స్వయంగా తెలిపారు. దీంతో జబర్దస్త్ నటులు తీవ్ర విషాదంలో నిండిపోయారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ జబర్దస్త్ షో నటుడు మృతి చెందారు. ఈటీవలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయినా..   మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి ఇవాళ కన్నుమూశారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా  జబర్దస్త్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన కమెడియన్ మూర్తి  మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.అయితే ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా ధృవీకరించారు.

జబర్దస్త్ కమెడియన్ మిమిక్రీ మూర్తి గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మిమిక్రీ మూర్తి.... జబర్దస్త్‌ ఒక్కటే కాకుండా ఎన్నో వేదికలపై అనేక ప్రదర్శనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  గత కొన్నాళ్లుగా మూర్తి  ‘ప్యాంక్రియాస్‌’ క్యాన్సర్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ మహమ్మారి నుండి బయట పడటానికి ఆయన చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ.. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన చివరకు ప్రాణాలు వదిలారు.

తనకున్న మిమిక్రీ టాలెంట్‌తో మూర్తి ఎవర్నే అయినా అనుకరించేవారు. అంతేకాదు . 2018 వరకు బుల్లితెరపై అయన అలరించారు. ఆ తర్వాత ‘ప్యాంక్రియాస్‌’ క్యాన్సర్‌ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కేవలం మూడు సంవత్సరాలలోనే  తన వైద్యం కోసం దాదాపుగా 16 లక్షలు ఖర్చు పెట్టారు. చాలామంది దాతలు కూడా మూర్తి అనారోగం కోసం తెలుసుకొని ఆయనకు చేతనైన సాయం చేశారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. గత కొన్నిరోజులుగా పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం హన్మకొండో చనిపోయారు.

తనకు వచ్చిన ఈ వ్యాధి వల్లే తాను చాలా సన్నగా మారిపోయానని గతంలో ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో జబర్దస్త్ వాళ్లకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు.

First published:

Tags: Jabardast, Jabardast comedian

ఉత్తమ కథలు