Hyper Aadi - Emmanuel: జబర్దస్త్ కామెడీ షోలో పంచులు వేయాలంటే హైపర్ ఆది(Hyper Aadi) తర్వాతే ఎవరైనా..? ఎవరిపై అయినా కూడా ఇట్టే పంచుల వర్షం కురిపిస్తుంటాడు ఆది. మరీ ముఖ్యంగా సెటైర్లు వేయడంలో ఆరితేరిపోయాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు హైపర్ కుర్రాడు.
జబర్దస్త్ కామెడీ షోలో పంచులు వేయాలంటే హైపర్ ఆది తర్వాతే ఎవరైనా..? ఎవరిపై అయినా కూడా ఇట్టే పంచుల వర్షం కురిపిస్తుంటాడు ఆది. మరీ ముఖ్యంగా సెటైర్లు వేయడంలో ఆరితేరిపోయాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు హైపర్ కుర్రాడు. తాజాగా ఇమ్మాన్యుయేల్, వర్ష జోడీని టార్గెట్ చేసాడు. వాళ్లపై చేసిన స్కిట్‌కు కడుపులు చెక్కలైపోయేలా నవ్వారు అనసూయ, రోజా. జబర్దస్త్‌లో ఇప్పుడున్న జోడీల్లో సుధీర్, రష్మి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నది ఇమ్మాన్యుయేల్, వర్ష. ఈ ఇద్దరిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దర్శకులు. ఈ మధ్య ఎప్పుడు చూసినా వీళ్లపైనే ప్రోమోలు కూడా కట్ చేస్తున్నారు. రెండు వారాల కింద కూడా ఇదే జరిగింది. తనను కాకుండా ఇమ్మూ వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి అని వర్షను రోజా అడిగింది. దానికి చాలా ఎమోషనల్ అయింది వర్ష. అదంతా స్క్రిప్టులో భాగంగానే జరిగింది. ఇప్పుడు దీన్నే స్పూఫ్ చేసాడు హైపర్ ఆది. తన స్కిట్లో భాగంగా ఇమ్మూను బాగానే టార్గెట్ చేసాడు ఆది. అక్కడ స్పూఫ్ మొదలైన క్షణం నుంచి అనసూయ అయితే పడీ పడీ నవ్వేసింది. సీట్ నుంచి దొర్లింది.. పైకి లేచి అటూ ఇటూ తిరుగుతూ మరీ నవ్వేసింది.
మరోవైపు రోజా కూడా పక్కనే ఉన్న మనోను కొడుతూ నవ్వేసింది. ఆ స్కిట్ అంతగా పేలింది. కేవలం ప్రోమోతోనే పిచ్చెక్కించాడు హైపర్ ఆది. రేపు ఫుల్ స్కిట్ వచ్చిన తర్వాత కచ్చితంగా యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవ్వడం ఖాయం.
ఆ ఎపిసోడ్లో వర్ష, ఇమ్మాన్యుయేల్ మాట్లాడిన మాటలనే ఇక్కడ స్పూఫ్ చేసారు. ఒక్కో మాట అక్కడ వాళ్ళు చెప్తుంటే.. ఇక్కడ నవ్వులు పూసాయి. పంచులు అయితే ధారాళంగా వేసాడు ఆది. మొత్తానికి వచ్చే వారం ఎపిసోడ్లో హైపర్ ఆది స్కిట్ పక్కా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం అయిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.