Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 4, 2021, 3:39 PM IST
జబర్దస్త్ లేడీ గెటప్ కమెడియన్స్ (Jabardasth Lady getup)
జబర్దస్త్ కమెడియన్స్‌లో చాలా మంది లేడీ గెటప్స్ వేస్తుంటారు. స్కిట్స్‌లో ప్రాధాన్యతను బట్టి అప్పుడప్పుడూ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి స్టార్ కమెడియన్స్ కూడా లేడీ గెటప్స్ వేసుకున్నారు. ఇంకొందరు అయితే కేవలం లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయ్యారు. అందులో శాంతి స్వరూప్ అందరికంటే ముందుంటాడు. ఈయన్ని అసలు లేడీ గెటప్ కాకుండా బయట ఎలా ఉంటాడో చాలా మందికి కనీసం ఐడియా కూడా లేదు. ఎందుకంటే చేసిన ప్రతీ స్కిట్లోనూ అమ్మాయిలాగే ఉంటాడు శాంతి. ఆయనతో పాటు తన్మయ్, హరికృష్ణ, వినోద్, కొమురం, మోహన్, పవన్ ఇలా చాలా మంది లేడీ గెటప్స్‌తోనే పాపులర్ అయ్యారు. వీళ్ల ఒరిజినల్ ఏంటో ఎవరికీ తెలియదు. అంతగా అమ్మాయిలు కూడా కుళ్లుకునేలా రెడీ అవుతారు వీళ్లు. ఇదిలా ఉంటే ఈ లేడీ గెటప్స్ కారణంగా తమకు లాభం ఎంతుందో నష్టం కూడా అంతే ఉందంటూ ఏడ్చేస్తున్నారు. తాము ఎంతగా ఈ లేడీ గెటప్స్‌తో నరకం చూస్తున్నాం అనేది తమకు మాత్రమే తెలుసు అంటున్నారు.

జబర్దస్త్ లేడీ గెటప్ కమెడియన్స్ (Jabardasth lady getup)
అందరూ లేడీ గెటప్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లే కావడం విశేషం. శాంతి స్వరూప్, వినోద్, మోహన్ లాంటి వాళ్లు అందులో ఉన్నారు. లేడీ గెటప్స్‌తో పాటు ఒరిజినల్‌గా తాము ఎలా ఉంటామో కూడా చూపించారు వాళ్లు. అంతేకాదు పెళ్లిళ్ల గురించి టాపిక్ వచ్చినపుడు అసలు విషయం చెప్పారు వాళ్ళంతా. తాము ఇలా లేడీ గెటప్స్ వేసుకుంటున్నది కేవలం ప్రొఫెషన్లో భాగమే కానీ నిజంగా కాదని అర్థం చేసుకోవాలి. కానీ తాము స్క్రీన్‌పై కనిపించేది కూడా మరోలా చూపిస్తున్నారని.. తమను అంతా తేడా అనుకుంటున్నారని బాధ పడ్డాడు శాంతి స్వరూప్. బయటికి వెళ్తే వీళ్లు అదేరా.. వీళ్లింక అలాగే ఉంటారంటరా అంటూ చెవులు కొరుక్కుంటున్నారని.. కానీ తమను తమలా అర్థం చేసుకునే అమ్మాయిలు దొరికినపుడు పెళ్లి చేసుకుంటామని చెప్పాడు శాంతి. అలాగే మిగిలిన వాళ్లు కూడా చెప్పారు. పెళ్ళి తర్వాత కూడా తమను కొందరు అలాగే చూస్తున్నారని.. తేడా అంటూ అవమానిస్తారని.. కనీసం అది పనిలో భాగంగానే చేస్తున్నట్లు ఎందుకు గుర్తించలేకపోతున్నారంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ జబర్దస్త్ కమెడియన్స్ ఆవేదన విన్న తర్వాత నిజమే కదా అనిపిస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
January 4, 2021, 3:36 PM IST