Home /News /movies /

JABARDASTH LADY COMEDIAN ROCKING RAKESH TEAMMATE ROHINI BOUGHT A NEW DUPLEX HOUSE AND VIDEO GOES VIRAL PK

Jabardasth Comedian: సొంతిల్లు కొన్న జబర్దస్త్ కమెడియన్.. వచ్చిన రెండేళ్లలోనే భారీ సంపాదన..

జబర్దస్త్ కామెడీ షో (Jabardasth comedy show)

జబర్దస్త్ కామెడీ షో (Jabardasth comedy show)

Jabardasth Comedian: జబర్దస్త్ కమెడియన్స్ (Jabardasth Comedian) ఈ మధ్య బాగానే సంపాదించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో కమెడియన్ కూడా చేరిపోయారు. హైదరాబాద్‌లో కలల ఇంటిని సొంతం చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
జబర్దస్త్ కమెడియన్స్ ఈ మధ్య బాగానే సంపాదించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా సంపాదన విషయంలోనే కాకుండా దాచిపెట్టడం విషయంలోనూ జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఆరితేరిపోయారు. ప్రస్తుతం లీడింగ్ కమెడియన్స్‌గా ఉన్న వాళ్లంతా హైదరాబాద్‌లో సొంతిళ్లు తీసుకుని సెటిల్ అయిపోయారు. సుడిగాలి సుధీర్ అయితే రెండిండ్లు తీసుకున్నాడు. హైదరాబాద్‌లో ఆయనకు రెండు సొంత ఇండ్లు ఉన్నాయి. ఆయన మాత్రమే కాదు.. జబర్దస్త్ కమెడియన్స్ అంతా దాదాపు బాగానే సెటిల్ అయ్యారు. ముఖ్యంగా టీమ్ లీడర్స్ అయితే ప్రతీ ఒక్కరు లక్షల్లో సంపాదిస్తున్నారు. తాము సంపాదించిన మొత్తం ఇంటిపై పెడుతున్నారు. టైమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి.. ఇప్పుడు సంపాదించిన మొత్తంతోనే సెటిల్ అయిపోతున్నారు. తమకంటూ సొంతిల్లు ఉండాలని ఎప్పట్నుంచో కలలు కంటున్న వాళ్లు.. వాటిని సాకారం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మరో జబర్దస్త్ కమెడియన్ కూడా సొంతింటి కలను నెరవేర్చుకుంది. ఈమెవరో కాదు.. రోహిణి. ఎన్నో ఏళ్ల కిందే ఇండస్ట్రీకి వచ్చిన రోహిణికి.. బిగ్ బాస్ షో తర్వాత జాతకం మారిపోయింది. అప్పట్నుంచి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అయితే జబర్దస్త్‌కు వచ్చిన తర్వాత ఈమెకు సంపాదన పెరిగింది. రాకేష్ టీమ్‌లో పర్మినెంట్ మెంబర్ అయిపోయింది రోహిణి. అతడితో అదిరిపోయే కెమిస్ట్రీ పండిస్తూ.. కామెడీతో కడుపులు చెక్కలు చేస్తుంది రోహిణి. జడ్జిలు కూడా రోహిణి కామెడికి ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె ఓ డ్యూప్లెక్స్ హౌజ్ కొనేసింది. ఈ సందర్భంగా హోమ్‌ టూర్‌ వీడియోను యూ ట్యూబ్‌లో షేర్‌ చేసింది రోహిణి.

Naga Babu - MAA Elections: మంచు విష్ణును గెలిపించడానికి మీకేంటి కంగారు.. ఓటుకి 10 వేలు ఇస్తున్నారంటున్న నాగబాబు..


ఈ వీడియోలో త‌న ఇంటిని అంతా చూపిస్తూ ఫ్యాన్స్‌కి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. భారీగానే ఖర్చు చేసి ఈ ఇంటిని కొనుగోలు చేసింది రోహిణి. ఈ వీడియోలో హాల్‌, కిచెన్‌, బెడ్‌రూమ్‌, గెస్ట్‌ బెడ్‌రూమ్‌, సిట్టింగ్‌ ఏరియా, టెర్రస్‌ ఇలా అన్నీ తిప్పి చూపిస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. తాను ఈ ఇంటిని ఫర్నీచర్‌తో సహా కొన్నానని.. త్వరలోనే తనకు నచ్చినట్లు మరింత అందంగా మార్చుకుంటానని చెప్పుకొచ్చింది రోహిణి. అంతేకాదు తనకు వ్యవసాయం అంటే ఇష్టమని.. అందుకే తన ఇంటిపైనే టెర్ర‌స్‌ గార్డెనింగ్ చేస్తానంటుంది.

Balakrishna Vs Ravi Teja: రవితేజపై ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమవుతున్న బాలకృష్ణ.. తగ్గేదే లే..!


సొంత‌ ఇల్లు కొనుక్కోవడానికి ఎంతో కష్టపడ్డానని.. ఎన్నో సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చింది రోహిణి. ఆ ఇంట్లోకి తన తల్లిని తీసుకెళ్లి చూపించింది. అమ్మ క‌ళ్ల‌లో ఆనందం చూసి రోహిణి కూడా చాలా ఎమోష‌న‌ల్ అయింది. సీరియల్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన రోహిణి.. ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి వచ్చింది. సీజన్ 3 కంటెస్టెంట్ ఈమె. దానికి ముందే కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌తో గుర్తింపు వచ్చినా కూడా నటిగా మాత్రం అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇప్పుడు వరసగా ఈటీవీలో షోలు, ఈవెంట్స్ చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తుంది రోహిణి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth rohini, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు