Home /News /movies /

JABARDASTH KARTHIK GETS PROMOTION AFTER THE EXIT OF AVINASH AS SOLO TEAM LEADER PK

Jabardasth Karthik: అవినాష్ వెళ్లిపోవడంతో పండగ చేసుకుంటున్న జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

Jabardasth Karthik: జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్య ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన నాగబాబు బయటికి వచ్చేసాడో కానీ అప్పట్నుంచి ఈ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వారం ఉన్నట్లు వచ్చే వారం కనిపించడం లేదు..

జబర్దస్త్ కామెడీ షోలో ఈ మధ్య ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన నాగబాబు బయటికి వచ్చేసాడో కానీ అప్పట్నుంచి ఈ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వారం ఉన్నట్లు వచ్చే వారం కనిపించడం లేదు ఇప్పుడు ఈ షో. అవసరానికి తగ్గట్లుగా టీమ్ లీడర్స్‌తో పాటు ఇంకా చాలా మార్పులు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలక మార్పు కూడా చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ జబర్దస్త్ కామెడీ షోలో ఉన్న అవినాష్.. ఇప్పుడు బిగ్ బాస్ షోకు వచ్చాడు. అందులో అందరితో కలిసిపోయిన జబర్దస్త్ రచ్చ చేస్తున్నాడు. అక్కడ తన మార్క్ చూపించుకుంటున్నాడు ఈయన. దానికి ముందు జబర్దస్త్‌లో ఈయన టీమ్ లీడర్. కార్తిక్‌తో కలిసి ఓ టీం ఫామ్ చేసాడు అవినాష్. మాస్ అవినాష్ కెవ్వు కార్తిక్ పేరుతో ఓ టీమ్ గత నాలుగేళ్లుగా రన్ చేస్తున్నారు ఈ జోడీ. అయితే ఇప్పుడు అవినాష్ బిగ్ బాస్‌కు వెళ్లడంలో ఓ టీమ్ లీడర్ కుర్చీ ఖాళీ అయిపోయింది. దాంతో దాన్ని భర్తీ చేసే పనిలో బిజీ అయిపోయారు జబర్దస్త్ నిర్వాహకులు.

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

ఇప్పటి వరకు ఇద్దరు టీమ్ లీడర్స్ ఉంటే ఇప్పుడు దాన్ని సోలో చేసారు. మాస్ అవినాష్ బిగ్ బాస్‌లో బిజీ కావడంతో కెవ్వు కార్తిక్‌ను సోలో టీం లీడర్‌గా చేసారు. ఈ మార్పుతో చాలా కాలంగా కలలు కంటున్న కార్తిక్‌కు సోలో టీమ్ లీడర్ పదవి వచ్చినట్లైంది. రేటింగ్స్ బాగా వస్తే కార్తిక్‌ను అలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. మొన్నటి వరకు అవినాష్ మళ్లీ తిరిగి జబర్దస్త్‌కు వస్తాడనే అనుకున్నారు కానీ అక్కడ్నుంచి తీసేసారని బిగ్ బాస్‌లో చెప్పాడు ఈయన. దాంతో కార్తిక్ ఫుల్ హ్యాపీ ఇప్పుడు. ఎందుకంటే సోలో టీం లీడర్‌గానే ఉంటాడు కాబట్టి. ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది.
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ (Kevvu karthik/facebook)
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తిక్ (Kevvu karthik/facebook)


వచ్చిన అవకాశాలను బాగానే వాడుకుంటున్నాడు కార్తిక్ కూడా. ఎందుకంటే ఈయన గత స్కిట్స్ అన్నీ బాగానే పేలాయి. ఇప్పటి వరకు అయితే అవినాష్ లేకపోయినా కూడా ఆ లోటు లేకుండా తన పని తాను చేసుకుంటున్నాడు కెవ్వు కార్తిక్. తొలి స్కిట్‌లోనే సోలో టీమ్ లీడర్ అయ్యానంటూ ప్రమోషన్ చేసుకుంటున్నాడు ఈయన. అంతేకాదు స్కిట్స్ కూడా బాగానే కొడుతున్నాడు. కొత్త కొత్త కామెడీ పంచులతో పిచ్చెక్కిస్తున్నాడు కార్తిక్. ఏదేమైనా కూడా ఈ మార్పులు అన్నీ కూడా జబర్దస్త్ కామెడీ షోకు మంచి రేటింగ్స్ తీసుకొచ్చేలా పని చేస్తాయా లేదా అనేది చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు