JABARDASTH JUDGE ROJA WIN AS MLA FROM NAGARI ASSEMBLY CONSTITUENCY TO PROVE THAT SHE IS NOT IRON LEG AS SAID BY SOME POLITICAL CRITICS TA
’రోజా’ పై ఉన్న ఆ ముద్ర చెరిగిపోయిందిగా..
ఎమ్మెల్యే రోజా (File)
సినిమాల్లో హీరోయిన్గా పీక్ స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది. అంతేకాదు టీడీపీ మహిళ అధ్యక్షురాలిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది. తాజాగా వైసీపీ తరుపున నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. అంతేకాదు వైపీసీ ఏపీలో క్లీన్ స్వీప్ చేయడంతో తనపై ఉన్న ఐరన్ లెగ్ ముద్ర చెరిపేసుకుంది.
సినిమాల్లో హీరోయిన్గా పీక్ స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది. అంతేకాదు టీడీపీ మహిళ అధ్యక్షురాలిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది. ఇక రోజా తెలుగు దేశంలో జాయిన్ తర్వాత చంద్రబాబుపై అలిపిరిలో బాంబ్ దాడి జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది. దీంతో అందరు రోజాను ఐరన్ లెగ్గా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలుగు దేశం ప్రతిపక్షంలో ఉండగా ..కాంగ్రెస్ పార్టీపై రోజా ఓ రేంజ్‌లోనే పోరాటాలు చేసింది. 2009 ఎన్నికల తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌కు లోనై కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకునే లోపే హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ఆర్ అకాల మరణం చెందారు. దీంతో రోజాపై ఐరన్ లెగ్ అనే ముద్ర స్థిరపడిపోయింది.
రోజా
ఆ తర్వాత రోజా..వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్సీపీలో జాయిన్ అయింది. అంతేకాదు వై.యస్.జగన్‌కు రాజకీయంగా అండగా ఉంటూ వచ్చింది. అంతేకాదు వైఎస్ఆర్సీపీ తరుపున మీడియాలో బలమైన వాయిస్ వినిపించేది. దీంతో పార్టీలో రోజాకు వై.యస్.జగన్ మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. ఐతే 2014 ఎన్నికల్లో రోజా ఫస్ట్ టైమ్ సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి దివంగత తెలుగు దేశం నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుపై అతి తక్కువగా 700 ఓట్ల మెజారిటీతో అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది .ఐతే రోజా లెగ్ మహత్యం వల్లే వైసీపీ ఓడిపోయిందని ఓ వర్గం వారు రోజాపై దుష్ఫ్రచారం చేసారు. ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవైపు రోజా ఎమ్మెల్యేగా ఉంటునే జబర్ధస్త్ ప్రోగ్రాంతో పాటు రచ్చబండ వంటి పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది.
రోజా,నాగబాబు
కానీ 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం వీచింది. దాదాపు 2/3 వంతు మెజారిటీతో వైసీపీ ఆధిక్యంలో మరికొన్ని గంటల్లో అధికారికంగా పూర్తి ఫలితాలు వెలబడనున్నాయి. ఈ ఎన్నికల్లో రోజా..2వేలకు పైగా స్వల్ప ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్ధిపై గెలిచింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో పాటు రోజాకు జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్లో మంత్రి పదవి ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ గెలుపుతో రోజా తనపై ఐరన్ లెగ్ అనే ముద్రను చెరిపేసుకుంది. మొత్తానికి రోజా తన గెలుపుతో పాటు పార్టీ గెలుపుతో సంబరాల్లో మునిగి తెేలుతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.